వీన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాలి.! వీడు తండ్రా.? థూ..!

హైదరాబాద్: కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రే కసాయిగా మారి కామంతో ప్రవర్తిస్తే ఇక ఆ చిన్నారి కూతురు తన వేదన ఎవరికి చెప్పుకోవాలి. తండ్రి వికృత చేష్టలకు బలవుతున్న ఆ చిన్నారి ఎంత నరకం అనుభవిస్తుండాలి. ఇలాంటి మానవ మృగాలను ఏం చెయ్యాలి.? కన్న కూతురన్న వాత్సల్యం లేకుండా పశువులా ప్రవర్తించిన ఆ కర్కోటకుడిని ఎంతటి చిత్రహింసలతో శిక్షించాలి.?కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురి మీద తండ్రి అఘాయిత్యం చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ లో వెలుగుచూసింది. ఇదే ఘటన విదేశాల్లో వెలుగుచూస్తే ప్రజల సమక్షంలో తల నరికేసే శిక్షను అక్కడి ప్రజలు డిమాండ్ చేసేవారు.

కన్న తండ్రే కాల యముడు.. కామ పిశాచిగా మారిన తండ్రి

కన్న తండ్రే కాల యముడు.. కామ పిశాచిగా మారిన తండ్రి

కన్న తండ్రే కొద్దికాలంగా అభం శుభం తెలయని కూతురిపై అత్యాచారం చేస్తున్న దుర్గటన వెలుగులోకి వచ్చింది. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఈ దారుణం వికారాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఈ విషయం బయటికి వచ్చింది. కంటికి రెప్పలా కన్న కూతున్ని కాపాడుకోవాల్సిన కన్న తండ్రి పశువులా ప్రవర్తించాడు. కామ దాహంతో ఏకంగా కన్న కూతుర్నే చెరిచాడు. దాదాపు ఏడాది కాలంగా ఆమెను భయపెట్టి, బెదిరించి ఈ అఘాయిత్యానికి పాల్పడుతూ తన కామ వాంఛను తీర్చుకుంటూ వచ్చాడు ఆ కసాయి తండ్రి.

కన్న కూతురిపై కన్నేసిన తండ్రి.. ఏడాది కాలంగా కోరిక తీర్చుకున్న కసాయి

కన్న కూతురిపై కన్నేసిన తండ్రి.. ఏడాది కాలంగా కోరిక తీర్చుకున్న కసాయి

చివరికి బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రే కొద్ది కాలంగా కూతురిపై అత్యాచారం చేస్తున్నట్లుగా వెల్లడైంది. ఈ దారుణం వికారాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. బాధితురాలి తల్లి విషయాన్ని తెలుసుకున్న తర్వాత కట్టలు తెంచుకున్న దుఃఖాన్ని మునిపంటితో ఆపుకుని జరిగిన ఘోరంపై స్పందించింది. స్థానిక పోలీసులకు ఫిర్యాదుతో ఈ విషయం బయటికి వచ్చింది. పోలీసులు, బాధితురాలి తల్లి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని ఓ గ్రామంలో నివసిస్తున్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి బతుకుదెరువు కోసం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లోని పటాన్‌చెరుకు ఆ కుటుంబం వలస వచ్చింది.

కూతురు గర్భవతి.. షాక్ కు గురైన తల్లి

కూతురు గర్భవతి.. షాక్ కు గురైన తల్లి

భార్య ఓ వెంచర్‌లో హెల్పర్‌గా పని చేస్తుండగా, భర్త ఆటో నడుపుతున్నాడు. 15 ఏళ్ల వయసుఉన్న పెద్ద కుమార్తె ఇంటి వద్ద ఉంటోంది. మధ్యాహ్నం సమయంలో తండ్రి ఇంటికి వచ్చి ఆమెపై అత్యాచారం చేసేవాడు. ఇటీవల తల్లి ముగ్గురు పిల్లలతో కలిసి సొంత ఊరికి వచ్చింది.పెద్ద కూతురు అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. బాలిక మూడో నెల గర్భవతి అని డాక్టర్లు తేల్చారు. దీంతో తల్లికి ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలినట్టు అయోమయానికి గురైంది.

కూతురిని మందలించిన తల్లి.. అసలు విషయం చెప్పడంతో పోలిసులకు ఫిర్యాదు

కూతురిని మందలించిన తల్లి.. అసలు విషయం చెప్పడంతో పోలిసులకు ఫిర్యాదు

అవాక్కయిన తల్లి కూతురుని అనుమానించి గట్టిగా మందలించగా ఆమె అసలు విషయం తెలిపింది. అనంతరం ఆ తల్లి భర్త వద్దకు వెళ్లి జరుగిన దారుణం పట్ల నిలదీసింది. దీంతో అతడు అందర్నీ చంపేస్తానని బెదిరించి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బాలికకు గర్భస్రావం చేయించేశాడు.పెద్ద కుమార్తెపై తండ్రి లైంగిక దాడికి పాల్పడుతూ, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించే వాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం మోమిన్‌పేటకు చేరుకుని కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+