రూ.19 లక్షల నుంచి రూ.వెయ్యికి తగ్గిన కరెంట్ బిల్లు: మహిళ నిలదీయడంతో సరిచేసిన ఏఈ..
తెలంగాణ రాష్ట్రంలో వినియోగదారులకు కరెంట్ బిల్లు పోటు తప్పడం లేదు. గృహ వినియోగదారులకు, చిన్న షాపులకు రూ.లక్షల్లో బిల్లు వస్తోంది. బిల్లు చూసి.. సదరు వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే నల్గొండలో ఓ వినియోగదారునికి రూ.19 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. యజమాని గొడవ చేస్తే వెంటనే బిల్లును అధికారులు సరిచేశారు. దీంతో బిల్లు రూ.19 లక్షల నుంచి రూ.వెయ్యికి తగ్గిపోయింది. దీంతో సదరు యజమాని శాంతించింది.
నల్గొండ పట్టణంలో రేకుల షెడ్డులో మాధవి అనే మహిళ ఉంటోంది. ఇందులో రెండు ట్యూబ్ లైట్లు, ఒక ఫ్యాన్, టీవీ మాత్రమే ఉన్నాయి. కానీ లాక్ డౌన్ వల్ల కరెంట్ బిల్లు తీయని సిబ్బంది.. ఇప్పుడు తీస్తూ వస్తున్నారు. మార్చి 4 వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు 9 లక్షల 4 వేల 259 యూనిట్ల కరెంట్ కాలిందని లెక్కతీశారు. ఇందుకు రూ. 19 లక్షల 19 వేల 268 వడ్డించారు. దీంతో ఆ మహిళ ఆందోళన చెందింది.

కానీ మాధవి మాత్రం ఊరుకోలేదు. విద్యుత్ అధికారులను నిలదీసింది. విద్యుత్ ఏఈ శ్రీనివాస్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించింది. దీంతో ఆయన వెంటనే కల్పించుకొన్నారు. కరెంట్ బిల్లును మళ్లీ తీశారు. 321 యూనిట్లు మాత్రమే కాలిందని ... అందుకు రూ. వెయ్యి కట్టాలని బిల్లు ఇచ్చారు. ఇదివరకు సాంకేతిక సమస్యతో బిల్లు అలా వచ్చిందని చెప్పారు. దీంతో సదరు మహిళ శాంతించింది. ఒక మాధవి కాదు మిగతా చోట్ల కూడా రూ.లక్షల కరెంట్ బిల్లు వస్తున్నాయి. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
Recommended Video
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications