కరెంట్ చార్జీల వాత.. ఈఆర్సీలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు.. ఎంత పెంచుతారంటే..
కరెంట్ బిల్లుల ఛార్జీల మోత మోగనుంది. ఇప్పటికే డిస్కంలు ప్రతిపాదనలు చేయగా.. సీఎం కేసీఆర్ కూడా అనుమతించరట. సో పవర్ బిల్లు మోత తప్పదు. ఇందుకు సంబంధించి ప్రకటన వెలువడటమే తరువాయిగా ఉంది. ఈఆర్‌సీ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం. పేదలపై భారం పడకుండా చూడాలని కేసీఆర్ స్పష్టంచేశారని తెలుస్తోంది.
విద్యుత్‌కు సంబంధించిన సమస్యలపై ఆయన కేసీఆర్ తీశారు. విద్యుత్ ప్రాజెక్టుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, త్వరగా కొత్త విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తేవాలని ఆదేశాలు జారీ చేశారు. సోలార్ పవర్‌పై దృష్టి సారించాలని కోరారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు కేంద్రప్రభుత్వ విధానాలే కారణమం అని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. టన్నుకు 50 రూపాయలు ఉండే గ్రీన్ ఎనర్జీ సెస్‌ను రూ.400 లకు పెంచింది. దీంతో ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వంపై 7 వేల200 కోట్ల ఆదనపు భారం పడుతుంది.

బొగ్గు ధరలను ఆరు నుంచి పది శాతం పెంచడంతో డిస్కమ్‌లపై ప్రతి సంవత్సరం అదనంగా రూ.725 కోట్ల భారం పడుతోంది. గత నాలుగు ఏళ్లలో బొగ్గు రవాణా రైల్వే ఛార్జీలు 40 శాతం మేర పెరిగాయని చెబుతోంది. డిస్కమ్‌లపై భారాన్ని తగ్గించేందుకు విద్యుత్ ఛార్జీలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఛార్జీలు స్వల్పంగానే పెంచుతామని చెబుతోంది. ఎంతమేర పెంచుతారనే అంశానికి సంబంధించిన సమాచారం రెండు రోజుల్లో తేలనుంది.
పవర్ బిల్లులతో సామాన్య, మధ్య తరగతి జనం ఇబ్బందులు పడతారు. కరోనా వల్ల కొందరికీ ఉపాధి కూడా సరిగా లేదు. ఈ క్రమంలో బిల్లుల వాత ఏంటీ అని కొందరు అడుగుతున్నారు. మళ్లీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా భయపెడుతుంది. ఇంతలో బిల్లుల మోతపై పేద, మధ్య తరగతి వారు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications