భారీగా పెరగనున్న కరెంటు చార్జీలు -21,550 కోట్ల లోటులో డిస్కమ్‌లు : సబ్సిడీని పెంచని ప్రభుత్వం ..!!
కొంత కాలంగా విద్యుత్ - ఆర్టీసీ ఛార్జీల పెంపు ఖాయమని ప్రచారం సాగుతోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే వీటి పైన నిర్ణయం తీసుకుంటారని అంచనా వేసారు. అయితే, ప్రభుత్వం ఛార్జీల పెంపు పైన నిర్ణయం ప్రకటించలేదు. ఇదే సమయంలో రెండేళ్ల కాలానికిగాను టీఎస్ఈఆర్సీకి డిస్కమ్‌లు సమర్పించిన ఏఆర్‌ఆర్‌లే ఛార్జీల పెంపు అంశాన్ని సూచిస్తున్నాయి.ప్రస్తుత (2021-22), వచ్చే (2022-23) ఆర్థిక సంవత్సరాలకు కలిపి డిస్కమ్‌లు ఏకంగా రూ.21,550 కోట్ల లోటును కలిగి ఉన్నాయి.2021-22కు సంబంధించి ఏఆర్‌ఆర్ రూ.45,618 కోట్లు కాగా, 2022-23కుగాను రూ.53053 కోట్లుగా పేర్కొన్నాయి.

21 వేల కోట్ల లోటులో డిస్కంలు
డిస్కమ్‌లకు వచ్చే ఆదాయం 2021-22లో రూ.29,343 కోట్లు, 2022-23లో రూ.36,474 కోట్లుగా తెలిపాయి. ఇక ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 2021-22కి రూ.5652 కోట్లు, 2022-23లో రూ.5652 కోట్లు అని వెల్లడించాయి. దీంతో 2021-22లో డిస్కమ్‌ల లోటు రూ.10623 కోట్లు, 2022-23లో రూ.10,927 కోట్లుగా వివరించాయి. దీనికితోడు 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరం కింద వాస్తవిక వ్యయం(ట్రూఅప్ ఛార్జీల కింద) కూడా రూ. వేల కోట్లలోనే ఉండనుంది. ఆదాయం వచ్చే వర్గాలపైనే కరెంటు చార్జీల పెంపు భారం ఉంటుందని ఇన్నాళ్లుగా ప్రభుత్వం చెబుతున్నా.. ఏ విధంగా ఈ పెంపుదల ఉంటుందనే దాని పైన ఇంకా స్పష్టత రాలేదు.

ప్రభుత్వం ఆదుకుంటుందా
అయితే ప్రభుత్వం ఏ మేరకు సహాయం చేసినా.. డిస్కమ్‌లు బతికి బట్టకట్టాలంటే మాత్రం కరెంట్ చార్జీల మోత మోగక తప్పని పరిస్థితి నెలకొంది. సాధారణంగా దేశంలో ఏ డిస్కమ్‌లు ఏఆర్‌ఆర్‌లు సమర్పించినా.. వాటిలో అంతర్భాగంగా టారిఫ్ ప్రతిపాదనలు ఉంటాయి. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ సంప్రదాయం మారింది. ఏఆర్‌ఆర్ దాఖలు చేశాక.. బహిరంగ నోటీసు (బహిరంగ విచారణ కోసం) ఇచ్చే క్రమంలో టారిఫ్ ప్రతిపాదనలు ఈఆర్‌సీ (విద్యుత్ నియంత్రణ మండలి)కి చేరుతున్నాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది.

సబ్సిడీ ఇచ్చినా భారం తప్పదంటూ
రెండేళ్లలో సబ్సిడీ ఎంత ఇవ్వనున్నదీ ముందే ప్రభుత్వం డిస్కమ్‌లకు ఎందుకు చెప్పిందన్నదీ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం సబ్సిడీని ముందే ప్రకటించడంతో రెండేళ్ల లోటును రూ.21550 కోట్లుగా డిస్కమ్‌లు ఏఆర్‌ఆర్‌లలో పేర్కొన్నాయి. 2019-20, 2020-21 ట్రూఅప్ చార్జీలు కూడా రూ.వేల కోట్లలో ఉండడంతో ఈ మొత్తం భారాన్ని నేరుగా ప్రజలపైనే వేయక తప్పదా.. కొంత మేర ప్రభుత్వం సర్దుబాటు చేస్తుందా అనేది ఇప్పుడు సందేహంగా మారుతోంది. కరెంట్ చార్జీలు పెంచుతామని రెండేళ్ల కిందటే సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటన చేశారు.

వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త ఛార్జీలు
ఈ ప్రతిపాదనలు సమర్పించేలోపు కరోనా ముంచుకురావడంతో పక్కన పెట్టేశారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని సీఎం పునరుద్ఘాటించారు. వాస్తవ స్థితిగతులపై ప్రజాభిప్రాయ సేకరణ, ప్రభావ వర్గాల నుంచి అభ్యంతరాలు సేకరించాకే నిర్ధారిస్తామని టీఎస్ ఈఆర్సీ ఛైర్మన్ టీ శ్రీ రంగారావు స్పష్టం చే శారు. టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాలని డిస్కమ్‌లను కోరుతూ లేఖ రాస్తామని, నిర్ణీత వ్యవధిలోగా సమర్పిస్తే.. టారిఫ్ ఉత్తర్వులను 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెస్తామని ప్రకటించారు. ఒకవేళ టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించకపోతే ఏం చేయాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications