కోర్టుకు హాజరయ్యే స్థితిలో లేదు: ప్రత్యూష ఆరోగ్య స్థితిపై నివేదిక, విచారణ 27కు వాయిదా
హైదరాబాద్: సవతి తల్లి చేతిలో చిత్రహింసలపాలై ఆస్పత్రిలో కోలుకుంటున్న ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై గ్లోబల్ అవేర్ ఆసుపత్రి వైద్యులు నివేదిక ఇచ్చారు. తీవ్రంగా గాయాల పాలైన ప్రత్యూషకు మరో వారం రోజుల పాటు వైద్యం అవసరమని వైద్యులు ఎల్బీనగర్ పోలీసులకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్నందున ప్రత్యూష కోర్టుకు హాజరయ్యే పరిస్థితిలో లేదని వైద్యులు చెప్పారు. ఈ నివేదికను ఎల్బీనగర్ పోలీసులు హైకోర్టులో సమర్పించారు. వైద్యుల నివేదికను పరిశీలించిన హైకోర్టు.. కేసు విచారణను జులై 27కు వాయిదా వేస్తూ తీర్పు వెలువరించింది.

దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాతే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎదుట ప్రత్యూషను హాజరుపర్చనున్నారు. కోర్టులో హాజరుపర్చిన అనంతరమే ప్రత్యూష బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications