Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపి పోరాట ఫలితమే పీఆర్సీ ప్రకటన.!సీఎం నిర్ణయంపై అనూహ్యంగా స్పందించిన బండి సంజయ్.!

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగుల పే రివిజన్ కమీషన్ పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటన పట్ల తెలంగాణ బీజేపి అనూహ్యంగా స్పందించింది. ఉద్యోగుల తరుపున బీజేపి చేసిన అనేక పోరాటాల ఫలితమే శాసనసభలో పీఆర్సీ పట్ల నేడు ముఖ్యమంత్రి చేసిన ప్రకటన అని బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే కాకుండా తెలంగాణ ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పటికి వెనకడుగు వేయదని బండి సంజయ్ స్పష్టం చేసారు.

ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే పీఆర్సీ.. తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ పీఆర్సీ ప్రకటించారన్న బండి సంజయ్..

ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే పీఆర్సీ.. తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ పీఆర్సీ ప్రకటించారన్న బండి సంజయ్..

ఇదిలా ఉండగా తెలంగాణ బీజేపీ చేసిన ఆందోళనలు, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనం బీజేపీ వైపు నిలబడటం వల్లనే రాష్ట్ర ప్రభుత్వానికి పీఆర్సీ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ బీజేపి ఛీఫ్ బండి సంజయ్ ఉద్ఘాటించారు. పీఆర్సీ కోసం బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేశారు, రక్తం చిందించారు, జైలు పాలు కూడా ఆయ్యారు. అందుకే గులాబీ ప్రభుత్వానికి పీఆర్సీ ప్రకటించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. బీజేపి తెగింపు ద్వారానే ప్రభుత్వం దిగొచ్చిందని సంజయ్ తెలిపారు.

ప్రజాధరణ కోల్పోతున్న టీఆర్ఎస్.. ఉద్యోగ సంఘాలను మచ్చికచేసుకునే ప్రయత్నమన్న బీజేపి ఛీఫ్..

ప్రజాధరణ కోల్పోతున్న టీఆర్ఎస్.. ఉద్యోగ సంఘాలను మచ్చికచేసుకునే ప్రయత్నమన్న బీజేపి ఛీఫ్..

ఇదిలా ఉండగా ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఫలితాలే పునరావృతం అవుతాయని ఆందోళన చెందిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాత్రికి రాత్రే ఉద్యోగ సంఘాలను పిలిపించుకుని పీఆర్సీ ఇస్తున్నట్లు చెప్పి వాళ్ల ద్వారా ప్రకటనలు చేయించుకున్నారని పేర్కొన్నారు. ఏది ఏమైనా బీజీపీ ఒత్తిడి, పోరాటం వల్లనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అనివార్యంగా పీఆర్సీ ప్రకటించారనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. కాని గతంలో ఇచ్చిన 43 శాతం కంటే ఎక్కువ ఫిట్ మెంట్ వస్తుందని ఆశించిన ఉద్యోగులందరిని ఈ ప్రకటన తీవ్ర నిరాశకు గురిచేసిందని, కనీసం 44 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని సంజయ్ తెలిపారు.

పీఆర్సీ పెంపు వేతనం కేవలం 12 నెలలేనా.. రిటైర్ మెంట్ తర్వాత ఇస్తామనడం దారుణమన్న సంజయ్..

పీఆర్సీ పెంపు వేతనం కేవలం 12 నెలలేనా.. రిటైర్ మెంట్ తర్వాత ఇస్తామనడం దారుణమన్న సంజయ్..

పీఆర్సీ కమిటీ వేసిన నాటినుంచి పూర్తిగా మొత్తాన్ని నగదు రూపంలో ఇచ్చినప్పుడే ఉద్యోగ, ఉపాద్యాయవర్గాలకు న్యాయం జరుగుతుందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. పీఆర్సీ పెంపు వేతనం కేవలం 12 నెలలు మాత్రమే ఇస్తామని, అది కూడా రిటైర్ మెంట్ తర్వాత ఇస్తామనడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను మోసం చేసినట్లే అవుతుందని స్పష్టం చేసారు. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటనలన్నీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మాత్రమేనని సంజయ్ వివరించారు.

పదవీ విరమణ వయసు పెంపు సాకుతో ఉద్యోగ నోటిఫికేషన్లు ఆపొద్దు.. ప్రభుత్వాన్ని హెచ్చరించిన బండి సంజయ్..

పదవీ విరమణ వయసు పెంపు సాకుతో ఉద్యోగ నోటిఫికేషన్లు ఆపొద్దు.. ప్రభుత్వాన్ని హెచ్చరించిన బండి సంజయ్..

ఆనాడు ఇదే విషయాన్ని చెప్పి ఓట్లేసుకుని ఈ మూడేండ్లు ఏ ఒక్కటి అమలుచేయకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను చంద్రశేఖర్ రావు ప్రభుత్వం మానసిక క్షోభకు గురిచేసిందని సంజయ్ మండిపడ్డారు.పైగా 2018 లో చెప్పిన దాన్ని ముడేండ్ల తర్వాత అమలు చేస్తున్నామని ప్రకటించి అదేదో గొప్ప చేశామని టీఆర్ఎస్ జబ్బలు చరుచుకోవడం వింతగా ఉందని పేర్కొన్నారు. ఈహెచ్ఎస్ విషయంలో కమిటీ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తోంది. సీజీహెచ్ఎస్ మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈహెచ్ఎస్ ను అమలు చేయాలని సంజయ్ డిమాండ్ చేసారు. పదవీ విరమణ వయసు పెంపు సాకుతో ఉద్యోగ నోటిఫికేషన్లు వేయక పోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని బండి సంజయ్ హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+