ప్రీతి మృతి కేసు: పోలీసుల కస్టడీలో సైఫ్; 6గంటల పాటు ప్రశ్నలవర్షం!!
పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి మృతి కేసులో నిన్న దాదాపు 6 గంటల పాటు మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో సైఫ్ ను విచారించారు. స్వయంగా సైఫ్ విచారణను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి రంగనాథ్ పర్యవేక్షించారు.
తెలంగాణ రాష్ట్రంలో కలకలంగా మారిన మెడికో ప్రీతి మృతి కేసులో అటు ప్రీతి కుటుంబ సభ్యులు, పౌర సంఘాలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్న క్రమంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కాకతీయ మెడికల్ కళాశాల పిజి వైద్య విద్యార్థిని ప్రీతి మృతి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కేఎంసీలో అనస్థీషియా హెచ్ ఓ డి నాగార్జున రెడ్డిపై ఆరోపణలు వచ్చిన క్రమంలో ఆయనపై వేటు వేసింది. ఆయన పై చర్యలలో భాగంగా నాగార్జున రెడ్డిని భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పోలీస్ కస్టడీలో సైఫ్ .. వరంగల్ లో కొనసాగుతున్న దర్యాప్తు
ప్రీతి సైఫ్ తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసిన క్రమంలో అనస్తీషియా విభాగపు హెచ్ఓడీ నాగార్జున రెడ్డి సరిగ్గా స్పందించలేదని, ఆయన సరిగ్గా స్పందించి ఉంటే ప్రీతి ఆత్మహత్య చేసుకునేది కాదని, నాగార్జున రెడ్డి పై ఆరోపణలు వచ్చిన క్రమంలో ప్రభుత్వం ఆయనను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడైన సైఫ్ ను వరంగల్ పోలీసులు నిన్న కస్టడీలోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు. ఖమ్మం జైలు నుంచి నిన్న వరంగల్ మటవాడ పోలీస్ స్టేషన్ కు నిందితుడు మెడికో సైఫ్ ను తీసుకువచ్చిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఆరు గంటల పాటు సైఫ్ ను ప్రశ్నించిన పోలీసులు
నిన్న దాదాపు 6 గంటల పాటు మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో సైఫ్ ను విచారించారు. స్వయంగా సైఫ్ విచారణను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి రంగనాథ్ పర్యవేక్షించారు. సాంకేతికంగా సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని పోలీసులు సైఫ్ కు అనేక ప్రశ్నలు సంధించారు. ప్రీతి, సైఫ్ మధ్య ఎందుకు గొడవలు వచ్చాయి? సైఫ్ ప్రీతిని వేధించాలని ఎందుకు ప్రయత్నించాడు. తోటి మెడికోలతో ప్రీతి గురించి ఎందుకు చెప్పాడు అనే అంశాలతో పాటు వాట్సప్ చాటింగ్ పై కూడా సైఫ్ ను పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం.

నేడు రెండో రోజు సైఫ్ విచారణ..
నేడు రెండవ రోజు కూడా సైఫ్ ను పోలీసులు విచారించనున్నారు. ప్రీతి మృతి కేసు నిందితుడు సైఫ్ ను కోర్టు అనుమతితో నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్న అంశాలతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ ల పైన విచారణ జరుపుతున్నారు. మరోవైపు తనకు ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులో ఫిబ్రవరి 28వ తేదీన సైఫ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై ఇంతవరకు కోర్టు విచారణ జరపలేదు. సైఫ్ నాలుగు రోజులపాటు పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొనే క్రమంలో ఈ కేసులో మరేమైనా ముఖ్యమైన విషయాలు బయటకు వస్తాయా అన్నది తెలియాల్సి ఉంది.

హత్యే అంటూ సంచలన ఆరోపణలు చేసిన ప్రీతి సోదరుడు
కాగా నిన్న ప్రీతి సోదరుడు పృథ్వి ఈ కేసుపై సంచలన ఆరోపణలు చేశారు. తన సోదరిది హత్యే అన్నారు. నిమ్స్ లో ప్రీతి పొత్తికడుపు వద్ద సర్జరీ చేశారని, ఆ సర్జరీ ఎందుకు చేశారో కూడా ఇప్పటివరకు తెలియలేదని పేర్కొన్నాడు ప్రీతి సోదరుడు. ప్రీతికి చేతి పై గాయం ఉందని, ప్రీతికి పూర్తిగా శరీరంలో బ్లడ్ డయాలసిస్ చేశారని పేర్కొన్న అతను పోస్టుమార్టంలో ప్రీతి బాడీలో ఉన్న ఇంజక్షన్ గురించి ఎలా తెలుస్తుంది అంటూ ప్రశ్నించారు. నిమ్స్ లో జరిగిన చికిత్సపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications