అల్లూరి సీతారామరాజు పోరాటం ప్రత్యేకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంస

హైదరాబాద్: స్వాత్రంత్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం, దేశ భక్తి అసమానమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అల్లూరి సీతారామారాజు 125వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ద్రౌపది ముర్ము మాట్లాడారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం వలే అల్లూరి సీతారామరాజు పోరాటం కూడా ప్రజల్లో స్ఫూర్తి నింపింది. మహానీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాలి. అల్లూరి ఒక ప్రత్యేకమైన యుద్ధ నైపుణ్యంతో ఆంగ్లేయులపై పోరాటం చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా భీమరవంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతి వనాన్ని హైదరాబాద్ నుంచి రాష్ట్రపతి వర్చువల్‌గా ప్రారంభించారు.

President draupadi murmu participates in alluri sitarama raju 125th anniversary celebration

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. గొప్ప త్యాగాలతోనే గొప్ప విజయాలు నమోదవుతాయని.. మన్యం వీరుడి పోరాటం అసాధారణమైదన్నారు. అమృత్ కాల్‌లో ఈ వేడుకలు జరగుతున్నాయన్నారు. ఓ జాతి కోసం అల్లూరి సీతారామరాజు పోరాడలేదని.. దేశం కోసం ఆయన పోరాడారని గవర్నర్ తెలిపారు. ఆంగ్లేయులను గడగడలాడించిన అల్లూరి పోరాటాన్ని మర్చిపోవద్దన్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకే వర్గానికి పరిమితమైన వ్యక్తి అల్లూరి కాదన్నారు. సూర్య చంద్రులు ఉన్నంతవరకు విస్మరించలేని క్షత్రియ వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అల్లూరి వీరుడు మాత్రమే కాదని.. వైద్యుడు, ఆధ్యాత్మిక వేత్త కూడా అని చెప్పారు. 125వ జయంతివేళ దేశం మొత్తం మన్యం వీరుడికి నివాళులర్పిస్తోందన్నారు.

President draupadi murmu participates in alluri sitarama raju 125th anniversary celebration

మరోవైపు, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. అల్లూరి పోరాటంపై ప్రశంసలు కురిపించారు. ప్రజలమీద పీడన దోపిడీ విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో దైవాంశ సంభూతులు పుడతారని, 'సంభవావి యుగే యుగే ' అని గీతాచార్యుడు చెప్పిన మాటలు, 26 ఏండ్ల అతిపిన్న వయస్సులోనే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి అమరుడైన అల్లూరి సీతారామరాజు జీవితానికి నిజంగా వర్తిస్తాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.

స్వేచ్ఛావాయువులు పీల్చుతూ స్వయం పాలన కోసం సాగిన స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి గొప్ప స్ఫూర్తిని రగిలించారని సీఎం అన్నారు. అల్లూరి స్ఫూర్తిని తెలిపే గీతాలను వింటూ తాను తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎంతో స్ఫూర్తిని పొందానని సీఎం అన్నారు.

దేశ స్వాతంత్ర్యోద్యమంలో పోరాడి అసువులు బాసిన భగత్ సింగ్ వంటి గొప్ప వీరుల సరసన తెలుగునేల మీదనుంచి అల్లూరి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని సీఎం స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల నిర్వాహకులయిన క్షత్రియ సేవా సమితి ప్రతినిధులను సీఎం వేడుకల ముగింపు సందర్భంగా అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+