తెలంగాణలో మళ్లీ "సమ్మె" సైరన్.. ప్రైవేట్ కాలేజీలు బంద్ !!
తెలంగాణలోని ప్రైవేటు కాలేజీలు మళ్లీ సమ్మెకు సిద్ధం అవుతున్నాయి. ప్రభుత్వం ఫీజు రీఇంబర్స్‌మెంట్ డ్యూస్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి భారీ మొత్తంలో రావాల్సిన బకాయిలు నిలిచిపోవడంతో.. యాజమాన్యాలు మరోసారి సమ్మె బాట పట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల అత్యవసర సమావేశం నిర్వహించింది.
భేటీ అనంతరం ఎఫ్‌ఏటీహెచ్‌ఐ ఛైర్మన్ రమేశ్ మాట్లాడుతూ తమ భవిష్యత్ కార్యాచరణను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఆఖరి ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 12వ తేదీలోగా బకాయిలు విడుదల చేయని పక్షంలో, 13వ తేదీ నుంచి అన్ని ప్రైవేట్ కళాశాలలు సమ్మెకు వెళ్లనున్నాయని స్పష్టం చేశారు.

గత చర్చల సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.1,200 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే, దసరా పండుగ సందర్భంగా కేవలం రూ.200 కోట్లు మాత్రమే చెల్లించారని, ఇది తమకు ఆగ్రహం కలిగించిందని యాజమాన్యాలు తెలిపాయి. గత నెల 21, 22 తేదీల్లో రూ.600 కోట్లు ఇస్తామన్న హామీ కూడా నెరవేరలేదని గుర్తుచేశారు.
కాగా ప్రభుత్వం ఈ నెల 12వ తేదీలోగా రూ.వెయ్యి కోట్లు తక్షణమే విడుదల చేయాలని కోరారు. అలానే మిగిలిన బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఒక స్పష్టమైన క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇకపై తమ డిమాండ్లపై ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) తప్ప మరెవరితోనూ చర్చించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే.. ఈ సమస్యను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు అల్టిమేటం జారీ చేశాయి. అవసరమైతే, తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఎదురవుతున్న సమస్యలపై విద్యార్థులకు వివరించి, వారితో కలిసి 'చలో హైదరాబాద్' కార్యక్రమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు.
ఇక ఫీజుల బకాయిలు చెల్లించకపోవడం వల్ల అనేక ప్రైవేట్ కళాశాలలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయని వాపోతున్నారు. అధ్యాపకులకు జీతాలు చెల్లించలేక పోతున్నామని.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కష్టమవుతోందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఇదే డిమాండ్‌తో గత నెలలో ప్రైవేట్ కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న బంద్ విజయవంతమైంది. ఇప్పుడు మళ్లీ ప్రైవేట్ కళాశాలల బంద్ కు సిద్దం అవుతుండడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications