జడ్చర్లలో ట్రావెల్స్ బస్సు - యాసిడ్ ట్యాంకర్‌ ఢీ.. 26 మంది ??

తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల వరుసగా బస్సు ప్రమాద ఘటనల్లో ప్రజలు మృతి చెందిన విషయం తీవ్రంగా కలిచివేస్తుంది. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరో పెను ప్రమాదం తప్పింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పరిసరాల్లో జాతీయ రహదారి 44పై ఈరోజు ( నవంబర్ 20, 2025 ) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.

అసలేం జరిగిందంటే..

చిత్తూరు నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్న జగన్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు.. ముందుగా వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్‌ను వెనుకనుంచి ఢీకొట్టడంతో పెను ప్రమాదం జరిగింది. కాగా బస్సులో మొత్తం 26 మంది ప్రయాణికులు ఉండగా.. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టిన వెంటనే యాసిడ్ లీకై రోడ్డుమీద పడింది. అయితే రసాయనిక ప్రతిచర్య వల్ల వెంటనే తెల్లటి పొగలు విపరీతంగా వచ్చాయి. ఈ అనూహ్య ఘటనతో ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. అయితే హైడ్రోక్లోరిక్ యాసిడ్ మంటలు అంటుకునేది కాకపోవడం పెద్ద ప్రమాదాన్ని తప్పించింది.

private-travels-bus-collides-with-acid-tanker-in-jadcharla

అయితే ఢీకొన్న వెంటనే పరిస్థితి సీరియస్‌గా మారుతుందనే భావించిన డ్రైవర్.. వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. అందరూ ఎగ్జిట్‌ డోర్లు, ఎమర్జెన్సీ విండోల ద్వారా క్షణాల్లో బయటకు దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి కానీ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఇక సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది కెమికల్ లీకేజ్‌ను నియంత్రించారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జాం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. బస్సు ముందు ఒక కారు అకస్మాత్తుగా లైన్ మార్చడంతో.. బస్సు డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్‌ వేసి తప్పించుకునే ప్రయత్నంలో ముందున్న యాసిడ్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టినట్లు ప్రయాణికులు తెలిపారు. బస్సు వేగం కూడా ప్రమాద తీవ్రతకు కారణమై ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో భాగంగా వెల్లడికానున్నాయి. మరోవైపు ఇటీవల వరుస బస్సు ప్రమాదాలతో ప్రజల్లో భయం నెలకొంది. ఈ తరుణంలోనే జడ్చర్లలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

భద్రతా నిబంధనలపై మరోసారి ప్రశ్నలు..

  • కెమికల్ ట్యాంకర్లకు సరైన హెచ్చరిక లైట్లు, సిగ్నల్స్ ఉన్నాయా?
  • ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రాత్రి వేళల్లో వేగం పెరగడం నియంత్రించడంలో లోపాలు ఉన్నాయా?
  • యాసిడ్ ట్యాంకర్లకు ప్రత్యేక మార్గాలు సూచించే అవసరం ఉందా?
  • బస్సుల్లో ఎమర్జెన్సీ సేఫ్టీ డ్రీల్స్ ప్రాక్టీస్ చేయించాలా?
  • ఈ ప్రమాదం ఈ అంశాలన్నీ పునర్విమర్శించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+