హైదరాబాద్ నగరానికి ప్రియాంక గాంధీ.!కుమారుడి కంటి చికిత్స కోసం నగరానికి రాక.!
హైదరాబాద్ : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ప్రియాంక గాంధీ హైదరాబాద్ రాబోతున్నారు. నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స కోసం ప్రియాంక గాంధీ నగరానికి రానున్నారు. నాలుగేళ్ల క్రితం ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిని సందర్శించారు. ఆ సందర్బంగా రాబర్ట్ వాద్రా రెండు రోజుల పాటు నగరంలో ఉన్నారు. ప్రస్తుతం వాద్రా సతీమణి ప్రియాంక గాంధీ కూడా అదే ఆసుపత్రికి చికిత్స కోసం విచ్చేస్తున్నారు. దాదాపు ఒక రోజు మొత్తం ఆవిడ నగరంలో ఉండే అవకశాలు ఉన్నట్టు తెలుస్తోంది. గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఆవిడ నగరంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. నాలుగున్నరేళ్ల క్రితం ప్రియాంక గాంధీ కుమారుడి రైహాన్ కంటికి గాయానికి సంబందించి మరొక్కసారి చికిత్ప కోసం ఆవిడ నగరానికి వచ్చినట్టు తెలుస్తోంది.

Recommended Video
క్రికెట్ ఆడుతుండగా గాయ పడిన కుమారుడు రైహాన్ ను నగరంలోని ప్రముఖ కంటి ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఎయిమ్స్ వైద్యులు సూచించడంతో
ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో మరోసారి చికిత్స కోసం ప్రియాంక గాంధీ గురువారం తన కుమారుడు రైహాన్ సహా హైదరాబాదు వస్తున్నట్టు తెలుస్తోంది. రైహాన్ కంటి గాయానికి హైదరాబాబాదులోని ప్రఖ్యాత ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స చేయించనున్నారు. నాలుగున్నరేళ్ల కిందట రైహాన్ క్రికెట్ ఆడుతుండగా కంటికి దెబ్బ తగిలింది. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అప్పట్లో హైదరాబాదులో చికిత్స పొందిన రైహాన్ ను మరోసారి తీసుకువస్తున్నారు. చికిత్స అనంతరం రేపు సాయంత్రం ఢిల్లీ తిరుగు పయనం కానున్నారు. ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా దంపతులకు కమారుడు రైహాన్, కుమార్తె మిరాయా ఉన్నారు. రైహాన్ పూర్తిపేరు రైహాన్ రాజీవ్ వాద్రా. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గా చిన్న వయసులోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు రైహాన్ .












Click it and Unblock the Notifications