తెలంగాణకు మరోసారి ప్రియాంక గాంధీ: మూడు రోజులు, 10 బహిరంగ సభలు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచార జోరును పెంచారు. ఇప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లిఖార్జున ఖర్గే లాంటి కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి ప్రియాంక గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రానున్నారు.

నవంబర్ 24వ తేదీ నుంచి కాంగ్రెస్‌ అగ్రనేతలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi), రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ఇరువురు తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. ఈ నెల 24వ తేదీన తెలంగాణాకు వస్తున్న ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) మూడు రోజుల్లో పది నియోజక వర్గాలల్లో ప్రచార సభల్లోనూ, ర్యాలీల్లోనూ పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Priyanka Gandhi poll Campaign Schedule in Telangana: 3 days visit from 24th, 10 public meetings

ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు పాలకుర్తి, మధ్యాహ్నం 2 గంటలకు హుస్నాబాద్‌, సాయంత్రం 4 గంటలకు ధర్మపురి, 25వ తేదీన పాలేరు, ఖమ్మం, వైరా, మధిర నాలుగు నియోజక వర్గాలల్లో ప్రచారం(Election Campaign) నిర్వహిస్తారు. 25వ తేదీ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న ప్రియాంక గాంధీ, 27వ తేదీన ఉదయం తిరిగి వస్తారు. ఉదయం 11 గంటలకు మునుగోడు, మధ్యాహ్నం 2 గంటలకు దేవరకొండ, 4 గంటలకు గద్వాల్‌ ప్రచార సభల్లో ప్రయాంక గాంధీ పాల్గొని ప్రచారం చేస్తారు.

రాహుల్ గాంధీ పర్యటన వివరాలు:

నవంబర్ 24 నుంచి 26వ తేదీ వరకు రాహుల్‌ గాంధీ తెలంగాణాలో ప్రచారం నిర్వహించనున్నారు. 24వ తేదీన జుక్కల్, మెదక్, తాండూరు, ఖైరతాబాద్‌లల్లో రాహుల్‌ గాంధీ ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరనున్నారు రాహుల్. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ గ్యారంటీలు, మేనిఫెస్టోను ప్రజలకు మరింతగా వివరించనున్నారు.

ఇప్పటికే ఈ ముగ్గురు రాష్ట్రంలో పర్యటించి కాంగ్రెస్ తరుఫున పోటీ చేస్తున్న అభ్యర్దులను గెలిపించాలని కోరారు. నవంబర్ 19న కొమురం భీం ఆసిఫాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షలు ఉద్యోగాలు తీస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, బీఆర్ఎస్, బీజేపీలపైనా విమర్శలు గుప్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+