వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాసరి మృతి: ప్రముఖుల దిగ్భ్రాంతి, సంతాపం.. ఎవరెవరు, ఏమన్నారంటే...

దర్శకరత్న దాసరి నారాయణరావు ఆకస్మక మృతిపై పలువురు రాజకీయ రంగ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దాసరి మృతిపై ఎవరెవరు, ఏమేం అన్నారో.. వారి మాటల్లోనే...

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు ఆకస్మక మృతిపై పలువురు రాజకీయ రంగ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సినీరంగానికి దాసరి చేసిన సేవలను వారు కొనియాడారు.

ఎంతోమందిని సినీరంగానికి పరిచయం చేసిన ఘనత దాసరి సొంతమన్నారు. చలనచిత్ర రంగం ఒక మూల స్థంభాన్ని కోల్పోయిందంటూ విచారం వ్యక్తం చేశారు. దాసరి మృతిపై ఎవరెవరు, ఏమేం అన్నారో.. వారి మాటల్లోనే...

దాసరి సేవలు ఎనలేనివి: గవర్నర్ నరసింహన్

దాసరి సేవలు ఎనలేనివి: గవర్నర్ నరసింహన్

దర్శకరత్న దాసరి నారాయణ రావు ఆకస్మిక మృతి పట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఇ. ఎస్.ఎల్. నరసింహన్ విచారం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా మరియు తెలుగు సినీ దర్శకునిగా అయన ఎనలేని సేవలు అందించారని గవర్నర్ పేర్కొన్నారు.

తెలుగు సినీ పరిశ్రమ మూల స్థంభాన్ని కోల్పోయింది: చంద్రబాబు

తెలుగు సినీ పరిశ్రమ మూల స్థంభాన్ని కోల్పోయింది: చంద్రబాబు

దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు మృతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్ర రంగం ఒక మూలస్థంభాన్ని కోల్పోయిందన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయస్థాయికి తీసుకువెళ్లిన దాసరి పరిశ్రమకు పెద్దదిక్కుగా నిలిచారని శ్లాఘించారు.

నాతో చాలా సన్నిహితంగా ఉండేవారు: వెంకయ్య నాయుడు

నాతో చాలా సన్నిహితంగా ఉండేవారు: వెంకయ్య నాయుడు

ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి, కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన దాసరి నారాయణరావు మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మొదట్లో ‘ఉదయం' పేరుతో దినపత్రికను స్థాపించి దానికి సంపాదకుడుగా పనిచేశారని, తనతో చాలా సన్నిహితంగా ఉండేవారని ఆయన అన్నారు. కేంద్రమంత్రిగా దాసరి పని చేశారని, సర్వజనహితాభిలాషిగా, అందరితో మంచిగా ఉంటూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెద్దన్నగా గుర్తింపు తెచ్చుకున్న దాసరి మరణం చాలా విచారకరమని అన్నారు. తెలుగు, తమిళ్, ఇతర భాషల్లోకూడా దాసరి పేరు ప్రఖ్యాతులు సాధించారని వెంకయ్య కొనియాడారు. దాసరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర: సీఎం కేసీఆర్

సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర: సీఎం కేసీఆర్

దర్శక నిర్మాత దాసరి నారాయణరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. దాసరి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దాసరి నారాయణరావు సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేశారని సీఎం అన్నారు. సినీ రంగంలో ఎంతోమందిని ప్రోత్సహించి వారి ఎదుగుదలకు కారణమైన ఆదర్శప్రాయుడన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకురావడంలో దాసరి చేసిన కృషి ఎప్పటికీ గుర్తుంటుందని సీఎం పేర్కొన్నారు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు: మంత్రి నారా లోకేశ్

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు: మంత్రి నారా లోకేశ్

దాసరి మృతికి ఏపీ మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మంత్రి నక్కా ఆనందబాబు, శిద్దా రాఘవరావు తదితరులు కూడా దాసరి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాసరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాసరి నారాయణరావు మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు.

English summary
Prominent Politicians from Andhra Pradesh And Telangana States comments on Sudden Death of Movie Director Dasari Narayana Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X