ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరా మస్తాన్ విచారణ, కీలక సమాచారం..!!
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే రివ్యూ కమిటీలోని కీలక అధికారులను విచారణ చేసింది. అధికారుల నుంచి కీలక సమాచారం రాబట్టింది. ఇక..రాజకీయ నేతల విచారణకు సిట్ సమాయత్తం అవుతోంది. కాగా, ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ ను సిట్ ఫోన్ టాపింగ్ పైన విచారణ చేసింది. తన ఫోన్ 2000 వ సంవత్సరం నుంచి ట్యాపింగ్ అవుతున్నట్లు అనుమానించినట్లు మస్తాన్ వెల్లడించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోల్ స్ట్రాటజీస్ సంస్థ వ్యవస్థాపకుడు ఆరా మస్తాన్‌ను సిట్ విచారించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన నూతన సిట్ ఈ విచారణ ప్రారంభించింది. ఇప్పటికే రెండు సార్లు పోలీసులు ఆరా మస్తాన్‌ను ప్రశ్నించింది. ఈసారి విచారణలో భాగంగా ఆయన గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్లను తిరిగి పరిశీలించి, కన్ఫర్మేషన్ కోసం అదే ప్రశ్నలను మరోసారి అడిగినట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు 2020 సంవత్సరం నుంచి ఆరా మస్తాన్ వివిధ కీలక రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులతో మాట్లాడిన ఫోన్ కాల్స్ రికార్డింగ్స్‌ను సమగ్రంగా పరిశీలించారు. ఈ కాల్ డేటా ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? జరిగితే ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? అనే అంశాలపై సిట్ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సిట్ అధికారుల విచారణ అనంతరం ఆరా మస్తాన్ కీలక వ్యాఖ్యలు చేసారు. నూతనంగా ఏర్పాటు చేసిన సిట్ తనను ఈరోజు విచారణకు రావాలని పిలిచిందని అన్నారు. అధికారుల పిలుపు మేరకే తాను హాజరయ్యానని తెలిపారు.

కాగా, గతంలో అడిగిన ప్రశ్నలనే మరోసారి అడిగి, తన వాంగ్మూలాన్ని నిర్ధారించుకున్నారని వెల్లడించారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను స్పష్టమైన సమాధానాలు ఇచ్చానని చెప్పుకొచ్చారు. తన ఫోన్ ట్యాపింగ్ 2020 సంవత్సరం నుంచే జరుగు తోందన్న అనుమానం ఉందని తెలిపారు. అప్పటి నుంచి తన కాల్స్, కమ్యూనికేషన్‌పై నిఘా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అంశాన్ని విచారణలో సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్ లినట్లు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిందని ఆరా మస్తాన్ అభిప్రాయపడ్డారు. గతంతో పోలిస్తే ఇప్పుడు విచారణ మరింత సమగ్రంగా, స్పష్ టంగా కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. నూతన సిట్ దర్యాప్తు ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కేసు త్వరలోనే ఒక స్పష్టమైన దశకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సిట్ అధికారులు తనకు చెప్పారని అన్నారు. తాను చట్టపరమైన ప్రక్రియలకు పూర్తిగా సహకరిస్తానని, నిజాలు బయటకు రావాలన్నదే తన ఆకాంక్ష అని ఆరా మస్తాన్ స్పష్టం చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications