నిన్న టెక్కీ.. నేడు మరో సైకో హల్‌చల్: చేతిలో కర్రతో దాడి, జనాల పరుగు
హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో వరుసగా రెండో రోజు.. మరో సైకో రెచ్చిపోయాడు. జిల్లాలోని సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్‌లో ఓ సైకో జనంపై చేతిలో కర్రతో విరుచుకు పడ్డాడు. చేతిలో కర్ర పట్టుకున్న సైకో వీధుల్లో వీరంగం చేశాడు.
కర్రతో రోడ్డు పైన ఉన్న వారిని చితక్కొట్టాడు. రోడ్డు పైన ఉన్న దుకాణాలలోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేశాడు. దీంతో ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యారు. అతని నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. స్థానికులు అతనిని చెట్టుకు కట్టేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతనిని అదుపులోకి తీసుకున్నారు.

ఇంతకుముందు ఓ యువ సాఫ్టువేర్ ఇంజినీర్ సైకోగా మారి జిల్లాలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఎంత కష్టపడినా సివిల్ సర్వీసెస్‌కు ఎంపికకాకపోవడం సదరు యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ఉన్మాదిగా మార్చేసింది.
తల్వార్‌తో తల్లిదండ్రులు సహా రోడ్డుమీద దొరికినోళ్లను దొరికినట్లుగా తల్వార్‌తో గాయపరుస్తూ బీభత్సం సృష్టించి చివరకు పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. కరీంనగర్‌లోని కమాన్ ప్రాంతంలో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications