కలకలం రేపుతున్న బంగారం పుకార్లు.

జనగామ :జనగామ జిల్లాలోని కొందరికి గుప్త నిదులు లభ్యమయ్యాయనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.ఆ నోటా ఈ నోట ఈ ప్రచారం కాస్త పోలీస్ స్టేషన్ వరకు చేరింది. కాని, బంగారం దొరకలేదని పోలీసులు చెబుతున్నారు.

జనగామ జిల్లాలోని నర్మెట మండలం అమ్మాపురం గ్రామంలో కొందరికి గుప్త నిధులు దొరికాయనే ప్రచారం సాగుతోంది.ఈ గ్రామంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈ విషయమై చర్చ సాగుతోంది. అయితే గుప్త నిధులు దొరికినట్టు సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పోలీసులు చెబుతున్నారు.

publicity of gold sensation in jagoan district

అమ్మాపురం గ్రామానికి చెందిన ఓ ఇంట్లో నిధులు దొరికాయని కొందరు, మసీదు వద్ద దొరికాయని మరికొందరు చెబుతున్నారు.ఈ గ్రామంలో కాకుండా జిల్లాలోనే వేరే ప్రాంతాల్లో నిధులు లభ్యమయ్యాయనే ప్రచారం కూడ సాగింది.ఈ విషయం పై పోలీసులకు సమాచారం అందింది.

గ్రామానికి చెందిన అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.గ్రామానికి చెందిన ఓ వ్యవసాయ బావి వద్ద వెతికితే రెండు బాక్సలు దొరికాయి. అందులో ఏమీలేవు. ఒక గ్లాసు దొరికింది. గ్రామస్థుల ముందే వాటిని పోలీసులు తెరిచారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. అసలు నిజంగా బంగారం దొరికిందా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+