ఆయనకు తెలిసిన మంత్రమొక్కటే: గోపీచంద్‌పై భార్య లక్ష్మి

హైదరాబాద్: చాలా మంది క్రీడాకారులు కోచ్ పుల్లెల గోపీ చంద్ అకాడమీకి వచ్చి వెళ్లిపోయారని, ఇక్కడికి ఎవరు వచ్చినా వారికి సహాయపడటమే ఆయనకు తెలిసిన మంత్రమని ఆయన సతీమణి పీవీవీ లక్ష్మి చెప్పారు. గోపీచంద్ శిష్యురాలు పీవీ సింధు రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ ఫైనల్‌కు చేరిన సందర్భంగా లక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు.

ఫోటో గ్యాలరీ : రియో దాకా సింధు

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫైనల్లో సింధు గెలిచి భారత్‌కు స్వర్ణ పతకం అందిస్తుందని ఆకాంక్షించారు. సైనా నెహ్వాల్, కశ్యప్, శ్రీకాంత్, గుత్తా జ్వాల, పీవీ సింధు కారణంగా బ్యాడ్మింటన్‌కు మన దేశంలో ఆదరణ పెరిగిందన్నారు.

pullela lakshmi On pullela gopichand

'ఇంకా మనం కేవలం చదువుల పట్లే మోజు చూపుతున్నాం. తాజా విజయాలు చదువుతోపాటు క్రీడలపై పిల్లలు మళ్లిస్తాయి' అని అన్నారు. అయితే, ఈ క్రీడకు సంబంధించిన ప్రమాణాలు ఇంకా మెరుగుపడాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

కేవలం చదువుపై మాత్రమే కాకుండా.. క్రీడలపై కూడా పిల్లలు దృష్టి కేంద్రీకరించేందుకు సింధు సాధించిన విజయాలు దోహదపడతాయన్నారు. 'కఠోర శ్రమ, అంకితభావానికి మారుపేరు గోపీచంద్' అని లక్ష్మి ప్రశంసించారు. కాగా, సింధు, సైనా నెహ్వాల్‌లు సాధించిన విజయాల్లో కోచ్ గోపీచంద్‌దే కీలక పాత్ర అని చెప్పడంలో అతిశయోక్తి అనిపించదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+