తెలంగాణ ఇసుక పాలసీ బాగుంది: సిద్దూ, ఇరకాటంలో కాంగ్రెస్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో ఇసుక పాలసీని పంజాబ్ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ ప్రశంసించారు. పంజాబ్ రాష్ట్రంలో కూడ ఇదే తరహ పాలసీని అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ఇసుక రీచ్‌లను సిద్దూ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణకు సర్కార్ చేపట్టిన చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని ఆయన చెప్పారు..

ఇసుక అక్రమ రవాణాకు ఈ రకమైన చర్యల వల్ల అడ్డుకట్ట పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు నదులున్న తెలంగాణ రాష్ట్రంలో ఇసుక రాబడి సుమారు రూ.1300 కోట్లుంటే, నాలుగు నదులున్న పంజాబ్ రాష్ట్రంలో ఇసుక రాబడి కేవలం రూ.130 కోట్లు మాత్రమేనని ఆయన చెప్పారు.

Punjab minister Navjot Singh Sidhu says Telangana mining policy will be emulated in Punjab

అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పై అధికార పార్టీ నేతలు కూడ విమర్శలు చేస్తున్నారు.

ఈ తరుణంలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత సిద్దూ తెలంగాణ ఇసుక పాలసీని ప్రశంసించడం రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలను ఇరుకున పెట్టింది. తెలంగాణలో సిద్దూ పర్యటన ఆ పార్టీపై టిఆర్ఎస్ నేతలు మరోసారి విమర్శలు చేసేందుకు ఉపయోగపడేలా ఉందని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Taking Telangana as an example, the Punjab government will come up with a sand mining policy that will ensure more money into the coffers of the government. Punjab's local bodies, culture and tourism minister Navjot Singh Sindhu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X