Diljit Dosanjh:రేవంత్ సర్కార్‌పై ఫైర్ అయిన స్టార్ సింగర్..!!
Diljit Dosanjh:ప్రముఖ పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజ్ తెలంగాణ సర్కార్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరినై ఆయన అసహనం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాదులో ఓ మ్యూజిక్ కాన్సర్ట్‌లో దిల్జీత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ఆల్బమ్‌లోని లెమొనేడ్, 5తారా అనే రెండు పాటల్లోని ఒరిజినల్ లిరిక్స్ తీసేసి కొంత మార్పు చేసి పాడారు. మద్యం, డ్రగ్స్, హింసను ప్రేరేపించే ఏ పాటైనా సరే పాడకూడదంటూ తెలంగాణ ప్రభుత్వం దిల్జీత్ పై ఆంక్షలు విధిస్తూ ముందస్తు నోటీసులు జారీ చేసింది.
ఒరిజినల్ లిరిక్స్‌లో మార్పు
ఇక దిల్జీత్ శనివారం పాల్గొన్న లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌కు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాను పాడిన లెమొనేడ్ పాటలో "తైను తేరీ కోక్ చ పంసంద్ ఆ లెమొనేడ్" అని పాడారు. ఒరిజినల్‌గా కోక్ స్థానంలో దారు అంటే మద్యం అనే పదం ఉండాలి. ఇక మరో పాట 5 తారాలో కూడా లిరిక్స్ మార్చి పాడారు. ఇక షో సందర్భంగా అక్కడికి వచ్చిన అభిమానులను ఉద్దేశించి దిల్జీత్ మాట్లాడారు. విదేశాల నుంచి వచ్చి పాడే సింగర్లపై ఎలాంటి ఆంక్షలు విధించని తెలంగాణ ప్రభుత్వం తనపై మాత్రం ఆంక్షలు విధించడాన్ని తప్పుబట్టారు.

ఒక ఆర్టిస్టు ఇంత దూరం వచ్చి అభిమానులను అలరించే సంగీత విభావరిలో పాల్గొని మంచి పాటలు పాడితే ప్రభుత్వాలు ఇబ్బందులకు గురిచేయడం తప్పు అని అన్నారు. భగవంతుడు తనతో ఉన్నాడని ఇలాంటి చర్యలు తతను ఏమి చేయలేవని చెప్పుకొచ్చారు. ఈ అంశాన్ని ఇంతటితో వదిలేది లేదని దిల్జీత్ తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరించారు. ఇలాంటి పెద్ద పెద్ద షోలు ఎలా జరుగుతున్నాయని ప్రభుత్వంలోని పెద్దలు ఆశ్చర్యపోతున్నారని చెప్పిన దిల్జీత్...కేవలం రెండు నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడుపోవడాన్ని వారు జీర్ణించుకోలేకున్నారని మండిపడ్డారు. అయితే తాను ఒక్కరాత్రిలోనే ఇంత పెద్ద స్టార్ కాలేదని చాలా కష్టపడితే ఈ స్థాయికి వచ్చినట్లు దిల్జీత్ గుర్తు చేశారు.
Let’s start Dry Nation Movement 🙏🏽
— DILJIT DOSANJH (@diljitdosanjh) November 17, 2024
Ahmedabad 🪷 pic.twitter.com/K5RfuSn2Kx
వివాదాస్పద వ్యాఖ్యలు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దిల్జీత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అన్ని ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. గుజరాత్‌లో మద్య పాన నిషేధంపై ఉన్న చట్టాలను దిల్జీత్ తన కాన్సర్ట్‌లో ప్రస్తావిస్తూ అన్ని రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం విధించాలని అప్పుడు తను కూడా పాడటం మానేస్తానని చెప్పుకొచ్చారు.తాను పాడే ట్రాక్స్‌లో చాలా తక్కువగా అల్కహాల్ గురించి ఉంటుందని అదే బాలీవుడ్ పాటలు తీసుకుంటే మద్యం గురించి పాటలు,స్టెప్పులు చాలా ఉన్నాయని అన్నారు. అంతేకాదు బాలీవుడ్ సెలిబ్రిటీల్లా తాను ఒక మద్యం బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం కానీ, నటించడం కానీ చేయలేదని గుర్తుచేశారు.
దిల్-టుమినాటీ ఇండియా టూర్ 2024లో భాగంగా నవంబర్ 17వ తేదీన అహ్మదాబాద్‌లో దిల్జీత్ కాన్సర్ట్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత లక్నో,పూణే, కోల్‌కతా, బెంగళూరు, ఇండోర్, చండీగఢ్‌లో మ్యూజిక్ కాన్సర్ట్‌లో పాడనున్నారు. డిసెంబర్ 29వ తేదీన గౌహతిలో చివరి కాన్సర్ట్‌తో ఈ టూర్ ముగుస్తుంది.












Click it and Unblock the Notifications