శ్రీతేజ్‌కు అల్లు అర్జున్ పరామర్శ
Allu Arjun: ఐకన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తొమ్మిదేళ్ల బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండట్లేదు. ఆరోగ్యం విషమంగానే ఉంది.
కిందటి నెల 4వ తేదీన సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. కిమ్స్ ఆసుపత్రి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు.

డాక్టర్ చేతన్ ఆర్ ముందాడ, డాక్టర్ విష్ణు తేజ్ పూడి పర్యవేక్షణలోని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటోన్నాడు. సంఘటన జరిగినప్పటి నుంచీ ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పులు ఉండట్లేదు. విషమంగానే ఉంటోందా బాలుడి ఆరోగ్యం. బ్రెయిన్ డ్యామేజ్‌కు గురయ్యాడు.
ఈ నేపథ్యంలో- అల్లు అర్జున్ కొద్దిసేపటి కిందటే కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్‌ను పరామర్శించారు. ఆ బాలుడి తండ్రి, రేవతి భర్త భాస్కర్‌ను ఓదార్చారు. ఆ సమయంలో ఆయన వెంట ప్రముఖ నిర్మాత, తెలంగాణ టీవీ, చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిల్ రాజు ఉన్నారు.
శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అల్లు అర్జున్ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రిపోర్టులను పరిశీలించారు. సుమారు 40 నిమిషాల పాటు ఆయన ఆసుప్రతిలోనే గడిపారు. శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ ఇదివరకే రెండు కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. కిందటి నెలలోనే ఆయన తండ్రి, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్.. శ్రీతేజ్‌ను పరామర్శించారు. అప్పుడే ఈ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
నిజానికి- ఇదివరకే అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి రావాల్సి ఉన్నప్పటికీ.. జాప్యం చోటు చేసుకుంది. రెండు రోజుల కిందటే ఆయన శ్రీతేజ్‌ను పరామర్శించాలని భావించారు. ఈ సమాచారం అందిన వెంటనే రామ్‌గోపాల్ పేట్ పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఇప్పుడే రావొద్దంటూ నోటీసులు ఇచ్చారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.












Click it and Unblock the Notifications