Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అల్లు అర్జున్‌‌‌కు పెరుగుతున్న రాజకీయ మద్దతు?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ ముసురుకున్న వివాదాలు రోజురోజుకూ తీవ్ర రూపాన్ని దాల్చుతూ వస్తోన్నాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన.. అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చిన తరువాత ఈ వ్యవహారం మొత్తం రోజుకో మలుపు తిరుగుతోంది. అల్లు అర్జున్‌ను మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది.

అసెంబ్లీలో చర్చతో..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చంద్రాయణగుట్ట శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ సహా పలువురు సభ్యులు ఈ తొక్కిసలాట ఉదంతంపై ఘాటుగా స్పందించారు. అదేరోజు సాయంత్రం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఈ వివాదానికి అడ్డుకట్ట వేయకపోగా మరింత ఆజ్యం పోసినట్టయింది.

Pushpa 2 stampede It is a small case says BJP MP Raghunandan Rao on actor Allu Arjun

ప్రెస్ మీట్ తరువాత ఆయనపై దాడి..

ఈ ప్రెస్ మీట్ తరువాత ఆయనపై దాడి మరింత తీవ్రతరమైంది. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసన మండలి సభ్యుడు బల్మూరి వెంకట్, విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్‌లో పశ్చాత్తాపం ఎంతమాత్రం కనిపించట్లేదని విమర్శించారు. పోలీసులను సైతం తప్పు పట్టేలా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌..

అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి కిందటే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు విచారణకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన వెంట తండ్రి అల్లు అరవింద్, మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, లీగల్ టీమ్ సభ్యులు ఉన్నారు.

సానుకూలం..

అల్లు అర్జున్ ఉదంతంపై తెలంగాణ భారతీయ జనతా పార్టీ లోక్‌సభ సభ్యుడు ఎం రఘునందన్ రావు స్పందించారు. ఆయన పట్ల సానుకూలంగా మాట్లాడారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్ ప్రమేయం ఏముందని ప్రశ్నించారు. ఎన్నో సంఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్నాయని, వాటితో పోల్చి చూస్తే ఇది చిన్నదేనని వ్యాఖ్యానించారు.

తొక్కిసలాట ఎవరి వైఫల్యం..

తొక్కిసలాట ఎవరి వైఫల్యం వల్ల సంభవించిందనే ఇక్కడ ప్రధానమని అన్నారు. సంధ్యా థియేటర్ వద్ద ప్రేక్షకులకు భద్రత కల్పించే విషయంలో ఎవరు విఫలం చెందారని ప్రశ్నించారు. పోలీసులా? లేక థియేటర్ యాజమాన్యమా? అనేది తేలాలని, ఈ దిశగా దృష్టి సారించాలని అన్నారు.

తప్పును కప్పిపుచ్చుకోవడానికి..

దీనిపై కాకుండా అల్లు అర్జున్‌ను కారకుడిగా చూపిస్తూ అరెస్ట్ చేయడం సరికాదని రఘునందన్ రావు అన్నారు. ఈ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం మరో తప్పు చేస్తోందని విమర్శించారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం తప్పయినప్పుడు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎలా ప్రెస్ మీట్ పెట్టగలరని, తొక్కిసలాట వీడియోలను ఎలా సోషల్ మీడియాలో విడుదల చేయగలరని ప్రశ్నించారు.

కోర్టులో ఉన్నందున..

ప్రస్తుతం ఈ అంశం మొత్తం కూడా కోర్టులో ఉన్నందున అటు పోలీసులు గానీ, ఇటు టాలీవుడ్ పెద్దలు గానీ మాట్లాడకపోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్‌పై పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదని విజ్ఞప్తి చేస్తోన్నానని రఘునందన్ రావు చెప్పారు. వ్యక్తిగతంగా పోలీసులు ఎలాంటి ప్రతీకారాలను తీర్చుకోకూడదని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ కూడా విచారణకు సహకరిస్తోన్నప్పుడు దీన్ని వివాదం చేయడం సరైంది కాదని రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+