చెట్టుకింద కుర్చీ వేసుకుని ప్రజలతో మాటా మంతీ.!వర్షాల్లో కూడా ఊపేస్తున్న మంత్రి.!
జనగామ/హైదరాబాద్ : నిత్యం జనంలోనే, జనంతోనే ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తన స్థాయిని, హోదాను పెద్దగా పట్టించుకోరు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా వినూత్నంగా గ్రామ బాట పట్టారు మంత్రి. మంత్రి ఎర్రబెల్లి జనంతో ఉండటమే ముఖ్యమనుకుంటారు. అలా అనేక సందర్భాల్లో వినూత్నంగా కార్యచరణ రూపొందించుకున్న మంత్రి మరోసారి తన రూటే సెపరేటని నిరూపించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాజాగా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలామ్ విగ్రహావిష్కరణకు వెళుతూ జనగామ జిల్లా లింగాల ఘన్‌పూర్ మండలం కుందారం క్రాస్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నియోజకవర్గంలోని సింగరాజుపల్లి, ఆ చుట్టు ముట్టు గ్రామాలకు చెందిన పలువురు మంత్రిని కలిశారు.ఈ సందర్భంగా మంత్రి ఆ పక్కనే ఉన్న చిన్న గుడిసె హోటల్ ముందు ఆగారు. అక్కడే ప్రయాణీకుల కోసం ఏర్పాటు చేసిన ఓ కుర్చీ మీద మంత్రి ఎర్రబెల్లి కూర్చున్నారు. అక్కడకు చేరుకున్న ప్రజలతో కాసేపు మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు సింగరాజుపల్లి చుట్టు ముట్టు గ్రామాలను కలిపి మండల కేంద్రం చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అందుకు మంత్రి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసి వారిలో దేవరుప్పుల పిఎసిఎస్ చైర్మన్ లింగాల రమేశ్ రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కత్తుల విజయ్, పెద్ద మడూరు సర్పంచ్ పెద్దారెడ్డి, సింగరాజుపల్లి సర్పంచ్ మల్లేశ్, నేల పోగుల సర్పంచ్ దూసరి గణపతి, చిన్నమడూరు ఎంపీటీసీ మల్లికార్జున్, ధరావత్ తండా సర్పంచ్ గేమా, నల్లకుంట తండా సర్పంచ్ రాజన్న తదితరులు ఉన్నారు.













Click it and Unblock the Notifications