పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ(74) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ఇటీవల బెంగళూరులో చికిత్స పొందారు. రెండు రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో ఆయనను కడ్తాల్‌లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి తరలించారు.

ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం సుభాష్ పత్రిజీ తుది శ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పిరమిడ్ ధ్యాన మండలి సభ్యులు తరలిరావాలని కోరారు.

 Pyramid Meditation Guru Subhash Patriji Passes Away

నిజామాబాద్ జిల్లాలోని బోధన‌లో జన్మించారు సుభాష్ పత్రిజీ. గతంలో కర్నూలు జిల్లాలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ సంస్థలో ఉద్యోగిగా పనిచేశారు. 2012లో కడ్తాల్ మండలం అన్మాసుపల్లి శివారులో ప్రపంచంలోనే అతిపెద్దదైన కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ నిర్మించారు.

అనేక ధ్యాన సభలను ఆయన నిర్వహించారు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూమెంట్ ఆఫ్ ఇండియాను పత్రిజీ గతంలో స్థాపించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశ వ్యాప్తంగా ఆయన అనుచరులున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+