మోహన్ బాబుకు షాకిచ్చిన పోలీసులు
మంచు మోహన్ బాబుకు రాచకొండ పోలీసులు షాకిచ్చారు. ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు రాచకొండ పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ మోహన్ బాబును పోలీసులు ఆదేశించారు. అంతేకాదు కాకుండా మోహన్ బాబు దగ్గర ఉన్న తుపాకీని సరెండ్ చేయాలని అన్నారు.మోహన్ బాబుతో పాటు, ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు దగ్గర ఉన్న గన్‌ను సైతం పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని రాచకొండ సీపీ కోరారు. జూబ్లీహిల్స్ నుంచి గన్ లైసెన్స్‌లు పొందిన మోహన్‌బాబు, విష్ణు.. ఇద్దరి తుపాకుల లైసెన్స్‌లు సీజ్ చేసి స్వాధీనం చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఇక మంచు కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరాయి. మోహన్‌బాబు, మంచు మనోజ్‌ల మధ్య ఆస్తి వివాదాలు ఏర్పడ్డాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది పరిస్థితి. మోహన్‌బాబు, మంచు మనోజ్‌లు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. జలపల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మంగళవారం రాత్రి హైడ్రామా నడిచింది.మనోజ్ తన భార్యతో భూమా మౌనికతో కలిసి మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడున్న సిబ్బంది ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

దీంతో అక్కడ ఇరు వర్గాలు కూడా ఘర్షణకు దిగారు. ఈ సమయంలో అక్కడకు వచ్చిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ పరిణామాలతో మోహన్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించింది. వెంటనే తండ్రి మోహన్ బాబును పెద్ద కుమారుడు మంచు విష్ణు ఆస్పత్రికి తరలించారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో మోహన్ బాబును చేర్పించారు. దీంతో వైద్యులు ఆయనకు వైద్యం అందిస్తున్నారు. మోహన్ బాబు భార్య అంతకుముందే ఆరోగ్యం క్షీణించడంతో ఇదే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications