తెలంగాణలో రాహుల్ పర్యటన - వరంగల్ లో రైతు సభ : పార్టీ నేతలకు ఇక నేరుగా..!!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపేందుకు రాహుల్ గాంధీ రంగంలోకి దిగుతున్నారు. తాజాగా పార్టీ ముఖ్య నేతలతో సుదీర్ఘంగా ఢిల్లీలో సమావేశం నిర్వహించిన రాహుల్ పలు కీలక సూచనలు చేసారు. తెలంగాణలో పార్టీ కోసం రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు పని చేస్తారని స్పష్టం చేసారు. ఇప్పటికే సునీల్ తెలంగాణలో క్షేత్ర స్థాయిలో సర్వే చేసిన నివేదికను రాహుల్ కు అందించారు. ఆ నివేదిక ఆధారంగా రాహుల్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు. అందరూ కలిసి కట్టుగా పని చేయాని స్పష్టం చేసారు.

రెండు రోజుల రాహుల్ పర్యటనలో..

రెండు రోజుల రాహుల్ పర్యటనలో..

అదే సమయంలో కొందరు రాష్ట్రంలో తరచూ పర్యటనలు చేయటం ద్వారా పార్టీలో కొత్త ఉత్సహం వస్తుందని రాహుల్ ను అభ్యర్దించారు. తాను తెలంగాణకు రావటానికి ఎప్పుడూ సిద్దమేనని..కార్యక్రమం ఫిక్స్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. దీంతో.. తెలంగాణ నేతలు రాహుల్ పర్యటన కోసం ముహూర్తం.. సభలు ఖరారు చేసారు. దీంతో.. తెలంగాణ నేతల సూచన మేరకు ఈ నెల 27-29 మధ్య రెండు రోజులపాటు ఆయన తెలంగాణలో పర్యటించేందుకు ఏఐసీసీ కార్యాలయ వర్గాల నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ నెల 28న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నిర్వహించే 'రైతు బహిరంగసభ'కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

పార్టీ నేతలకు దిశా నిర్దేశం

పార్టీ నేతలకు దిశా నిర్దేశం

ఈ సభ నిర్వహణను తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. వరంగల్‌ ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్స్ లో లేదా ములుగు నియోజకవర్గంలో ఈ సభ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. సభలో పాల్గొనటంతో పాటుగా రాహుల్ గాంధీ మరో రోజు తెలంగాణ లోనే ఉండనున్నారు. గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో రాహుల్‌ భేటీ కానున్నారు. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న అంతర్గత పరిణామాలు.. అసమ్మతి రాజకీయాలు.. సమావేశాల పైన రాహుల్ మ వైఖరి స్పష్టం చేయనున్నారు. అసమ్మి నేతల విషయంలో కఠినంగా పార్టీ అధినాయకత్వం వ్యవహిరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

వ్యూహకర్తతో కలిసి పని చేయాలంటూ

వ్యూహకర్తతో కలిసి పని చేయాలంటూ

ఇక, పార్టీ సభ్యత్వం సైతం సీరియస్ గా తీసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించారు.డీసీసీల అధ్యక్షులు, డిజిటల్‌ సభ్యత్వ నమోదులో క్రియాశీలంగా పనిచేసిన ఎన్‌రోలర్స్‌కు ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించనున్నారు. పార్టీ తరఫున స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలతో కూడా రాహుల్‌గాంధీ సమావేశమయ్యేలా టీపీసీసీ షెడ్యూల్‌ రూపొందిస్తోంది. రాహుల్ గాంధీ పర్యటన రాష్ట్రంలో ఉండేలా కొంత కాలంగా టీపీసీసీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఇప్పుడు తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాహుల్ పర్యటన ఖరారైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+