Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి పై రాహుల్ కీలక నిర్ణయం..!!

తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కొలువు తీరింది. ఇక, ఇప్పుడు ప్రధాన పార్టీలు లోక్ సభ ఎన్నికల పైన గురి పెడుతున్నాయి. ఇదే సమయంలో రేవంత్ పై హైకమాండ్ ఆశలు పెరుగుతున్నాయి. కేబినెట్ కూర్పు .. మంత్రుల శాఖలు ఖరారు చేసిన కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు పార్టీ పదవుల పైన కసరత్తు ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవంటంతో లోక్ సభ ఎన్నికల వేళ పీసీసీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే అంశం పైన రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రేవంత్ కొనసాగింపు
అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే విధంగా ఫలితాలు సాధించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పుంజుకోకుడా అడ్డకట్ట వేయాలని భావిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించటమే టార్గెట్ గా ఫిక్స్ చేసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ రేవంత్ గా హైకమాండ్ భావిస్తోంది. అధికారంలోకి వస్తూనే రేవంత్ కు సీఎం పగ్గాలు అప్పగించింది.

Rahl Gandhi hints CM Revanth Reddy continue as TPCC Chief upto Loksabaha Elections as Reports

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మెజార్టీ బొటా బొటీ మెజార్టీ మాత్రమే ఉంది. ఇదే సమయంలో ప్రస్తుతం సీఎం పదవితో పాటుగా పీసీసీ చీఫ్ గానూ రేవంత్ కొనసాగుతున్నారు. లోక్ సభ ఎన్నికల వరకు టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ ను కొనసాగిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ హైకమాండ్ కు కీలకం కావటంతో..ఇప్పటికిప్పుడు టీపీసీసీ బాధ్యతలు మరొకరికి అప్పగించేందుకు సిద్దంగా లేదనేది స్పష్టం అవుతోంది.

సీనియర్లు పోటీ
సీఎం పదవి రేవంత్ కు అప్పగించటంతో తమకు పీసీసీ చీఫ్ ఇవ్వాలని సీనియర్లు హైకమాండ్ ను కోరుతున్నారు. టీపీసీసీ చీఫ్ పదవి కోసం భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎంతో పాటుగా పీసీసీ చీఫ్ పదవిలో కొనసాగిస్తుండటంతో..తమకు అదే విధంగా ఇవ్వాలని భట్టి ప్రతిపాదించారు.

సీఎంగా రేవంత్ కు సహకరిస్తున్న సమయంలో తమకు పీసీసీ పదవి ఇవ్వాలనేది సీనియర్ నేతల వాదన. అయితే, సామాజిక సమీకరణాల్లో భాగంగా పీసీసీ చీఫ్ పదవి బీసీ వర్గానికి ఇవ్వాలనేది మరో డిమాండ్. దీంతో..మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ సైతం తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే రాహుల్ గాంధీ తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి పైన తాజాగా ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది.

జోడు పదవులతో రేవంత్
తాజాగా పార్టీ ముఖ్య నేతలు చెబుతున్న సమాచారం మేరకు లోక్ సభ ఎన్నికల వరకు టీపీసీసీ చీఫ్ పదవి మార్పు ఉండదని తెలుస్తోంది. రేవంత్ ను కొనసాగించాలనేది రాహుల్ గాంధీ అభిమతంగా చెబుతున్నారు. రేవంత్ వైపే రాహుల్ గాంధీ మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, ఇక..లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి మెజార్టీ సీట్లు సాధించటం ఇప్పుడు రేవంత్ సమర్ధతకు పరీక్షగా మారుతోంది.

Rahl Gandhi hints CM Revanth Reddy continue as TPCC Chief upto Loksabaha Elections as Reports

ముందుగా సీనియర్లు సహచర మంత్రులుగా కొనసాగుతున్నా..వారి సహకారం..మంత్రి పదవులు రానీ నేతల నుంచి వచ్చే సమస్యలు..పాలనా పరంగా ఉన్న సవాళ్లును అధిగమిస్తూ ఇప్పుడు సీఎంగా.. పీసీసీ చీఫ్ గా పార్టీని గెలిపించటం రేవంత్ కు ఛాలెంజ్ గానే కనిపిస్తోంది. రేవంత్ ను పీసీసీ చీఫ్ లోక్ సభ ఎన్నికల వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయని పార్టీలో చర్చ సాగుతోంది. దీంతో..పార్టీ నిర్ణయం పైన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+