పొంగులేటికి రాహుల్ గాంధీ కీలక హామీ - ఢిల్లీ వేదికగా..!!
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో చేరటం ఖాయమైంది. ఈ నెల 22 లేదా 23న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఢిల్లీలో పొంగులేటి, జూపల్లి కలవనున్నారు. గత కొంత కాలంగా పొంగులేటి ఏ పార్టీలో చేరుతారనే దాని పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చలు...కాంగ్రెస్ అగ్ర నేతల హామీల తరువాత పొంగులేటి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించారు. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీతో పొంగులేటి చర్చించారు. కీలక హమీ దక్కించుకున్నారు.
మాజీ మంత్రి జూపల్లి.. మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్ లోకి రావటం ఖాయమైంది. కొద్ది రోజులుగా కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం అధికారికంగా నిర్ణయం జరిగింది. కాంగ్రెస్ లో చేరే ముందు తన రాజకీయ భవిష్యత్ పైన పొంగులేటి ముఖ్య నేతల నుంచి హామీలు తీసుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డితో చర్చలు చేసారు. రేవంత్ తో కలిసి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిసారు. పార్టీలో చేరితే పొంగులేటితో పాటుగా జిల్లాలో కేటాయించాల్సిన సీట్ల పైన డీకే నుంచి పొంగులేటి హామీ తీసుకున్నారు. ఎంపీ స్థానంతో పాటుగా నాలుగు ఎమ్మెల్యే స్థానాలు పొంగులేటి సూచించిన వారికి ఇచ్చేలా నిర్ణయం జరిగిందని చెబుతున్నారు. అదే విధంగా జూపల్లికి ప్రాధాన్యత పైన డీకే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ లోకి తాము వస్తున్నట్లుగా పొంగులేటి, జూపల్లి హామీ ఇచ్చారు. ఈ ఇద్దరు నేతలు తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తో జూమ్ మీటింగ్ ద్వారా చర్చించారు. ఆ సమావేశంలో రేవంత్ తో పాటుగా డీకే శివ కుమార్ ఉన్నారు. ఈ నెల 22, లేదా 23న ఢిల్లీలో రాహుల్ ను కలిసేలా పొంగులేటి, జూపల్లికి అప్పాయింట్ మెంట్ ఖరారైంది. అదే విధంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని పొంగులేటి నిర్ణయం తీసుకున్నారు. ఆ సభకు రావాలని రాహుల్ ను ఆహ్వానించారు. తెలంగాణలో కాంగ్రెస్ కు అనుకూల పరిస్థితులు ఉన్నాయని..పార్టీ సీట్ల కేటాయింపు..అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాధాన్యత ఉంటుందని పొంగులేటికి రాహుల్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో భట్టి, రేణుకా చౌదరితో డీకే శివకుమార్ ఈ నేతల చేరిక పైన చర్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications