హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహుల్ చెంత... కాకాకు కన్నీటి వీడ్కోలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ కురు వృద్దుడు, సీనియర్ నేత గడ్డం వెంకటస్వామి (కాకా) అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో కాకా అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చితికి పెద్దకుమారుడు వినోద్‌ నిప్పు పెట్టారు.

సోమాజిగూడలోని కాకా చిన్న కుమారుడు వినోద్ ఇంటి నుంచి కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్, అటునుంచి పంజాగుట్ట శ్మశానవాటిక వరకు సాగిన అంతిమయాత్రలో వందలమంది అభిమానులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కాకా అంత్యక్రియలకు హాజరయ్యారు. బేగం పేట విమానాశ్రయం నుంచి నేరుగా పంజాగుట్ట శ్మశానవాటికకు చేరుకుని వెంకటస్వామి మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రాహుల్ గాంధీ వెంట దిగ్విజయ్ సింగ్, జైపాల్ రెడ్డి ఉన్నారు. అంతక ముందు కాకా మృతదేహానికి మంత్రులు హరీష్‌రావు, తుమ్మల, ఇంద్రకరణ్‌, జోగురామన్న, కాంగ్రెస్‌ నేతలు జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, డీఎస్‌, గీతారెడ్డి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

 అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

కాకా భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రక్కన తెలంగాణ ఎమ్మెల్యే రమణ.

 అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

కాకా భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటిస్తున్న వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహాన్ రెడ్డితో కరచాలనం చేస్తున్న మాజీ ఎమ్మేల్యే శంకర్ రావు.

 అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు


కాకా భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటిస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నరసింహులు.

 అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

కాకా భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత మాజీ ఎంపీ వివేక్‌ను ఓదారుస్తున్న చిరంజీవి.

 అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

కాకా భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావున హత్తుకుని ఏడుస్తున్న కాకా పెద్ద కొడుకు వినోద్.

అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

కాకా భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటిస్తున్నతెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు. ప్రక్కన డిప్యూటీ సీఎం రాజయ్య. వివేక్ నివాసానికి చేరుకుని కాకా భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు.

 అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

కాకా భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటిస్తున్నతెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు. చిత్రంలో కేకే, తెలంగాణ ఇతర మంత్రులను చూడొచ్చు. కాకా కుమారులు వివేక్, వినోద్, అల్లుడు శంకర్రావు ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు. టీఆర్‌ఎస్ నాయకుడు కే కేశవరావులతో కలిసి కేసీఆర్ దాదాపు 10 నిమిషాలపాటు అక్కడే ఉన్నారు.

 అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

కాకా భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటిస్తున్న తెలంగాణ అసెంబ్లీలో విపక్ష నేత కె. జానా రెడ్డి.

 అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

కాకా భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటిస్తున్న కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి. గతంలో జైపాల్ రెడ్డి మంత్రిగా పనిచేశారు.

 అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

కాకా అంతిమయాత్ర మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు సోమాజీగూడలోని వివేక్ ఇంటినుంచి ప్రారంభమైంది.

అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

కాకా పార్దివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం గాంధీభవన్‌కు తరలించారు. యాత్ర రాజ్‌భవన్, నాంపల్లి మీదుగా మధ్యాహ్నం 3.20 గంటలకు గాంధీభవన్‌కు చేరుకుంది.

అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

పీసీసీ అధ్యక్షుడు పొన్నాల, మాజీమంత్రి సునీతా లకా్ష్మరెడ్డి తదితరులు భౌతిక కాయంపై పార్టీ పతాకాన్ని కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. కాకా మృ తికి సంతాప సూచకంగా పార్టీపతాకాన్ని అవనతం చేశారు. వాహనాన్ని గాంధీ భవన్ వద్ద కేవలం ఐదు నిమిషాలు ఉంచారు.

 అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

అక్కడి నుంచి అంతిమయాత్ర సాయంత్రం 4.10 గంటలకు పంజాగుట్ట శ్మశానవాటికకు చేరుకుంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

 అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

పెద్ద కుమారుడు వినోద్ చితికి నిప్పంటించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సాయంత్రం 4:28 గంటలకు నేరుగా పంజాగుట్ట శ్మశానవాటికకు చేరుకున్నారు.

 అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

కాకా భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అంత్యక్రియలు పూర్తయ్యేవరకు అక్కడే ఉన్నారు.

 అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్‌రెడ్డి, ఐపీఎస్ అధికారులు అరుణా బహుగుణ, సయ్యద్ అన్వరుల్ హుదా, సినీ నిర్మాత డీ సురేష్‌బాబు, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ నేతలు, దళిత సంఘాల ప్రతినిధులు, పలు ప్రజా సంఘాల నాయకులు కాకా భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.

 అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

అంతిమయాత్రలో కాకాకు కన్నీటి వీడ్కోలు

కాంగ్రెస్ కురవృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) అంత్యక్రియలు మంగళవారం ప్రభుత్వ లాంఛనాలతో పంజాగుట్ట శ్మశానవాటికలో పూర్తయ్యాయి. కాకా పెద్ద కుమారుడు వినోద్ కాకా చితికి నిప్పంటించారు.

కుటుంబసభ్యులు, బంధువులు, వ్యాపారవేత్తలతోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాకా అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతకుముందు ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతోపాటు మంత్రులు, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ, ఏపీ శాసన మండళ్ల చైర్మన్లు స్వామిగౌడ్, చక్రపాణి, టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, రెండు రాష్ర్టాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాకా భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.

English summary
Congress vice president Rahul Gandhi today paid homage to senior party leader and former Union Minister G Venkataswamy who passed away here following prolong illness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X