టైమ్స్ నౌ సర్వే: టీఆర్ఎస్‌కు 70 సీట్లు, చంద్రబాబు-రాహుల్ గాంధీలకు ప్రజల తిరస్కరణ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో పదిహేను రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి, తెరాస ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. శుక్రవారం యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ బహిరంగ సభలో పాల్గొన్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు.
తాజాగా, టైమ్స్ నౌ సర్వే ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ కలయికను తెలంగాణ ప్రజలు తిరస్కరించినట్లు సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో కేసీఆరే అధికారంలోకి వస్తారని తేలింది. తెరాసకు గతంలో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ వస్తాయని తేలింది. 2014లో తెరాసకు 63 సీట్లు రాగా, ఇప్పుడు 70 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. ఈ సర్వే నవంబర్ 12 నుంచి 18వ తేదీ మధ్య చేశారు.

తెరాసకు 70 సీట్లు
ఈ ఎన్నికల్లో తెరాసకు 70 సీట్లు (2014లో 63 సీట్లు), కాంగ్రెస్ పార్టీకి 31 సీట్లు (2014లో 21 సీట్లు), తెలుగుదేశం పార్టీకి 2 సీట్లు (2014లో 15 సీట్లు), మజ్లిస్ పార్టీకి 8 సీట్లు (2014లో 7 సీట్లు), బీజేపీకి 3 సీట్లు (2014లో 5 సీట్లు), ఇతరులకు 5 సీట్లు వస్తాయని ఈ సర్వేలో వెల్లడైంది.

తదుపరి ముఖ్యమంత్రిగా కేసీఆర్ వైపే మొగ్గు
తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని చూడటానికి ఇష్టపడతాని అడగగా.. 45.27 శాతం మంది కేసీఆర్, 30.55 శాతం ఉత్తమ్ కుమార్ రెడ్డి, 3.37 శాతం మంది తెలంగాణ జన సమితి చీఫ్ కోదండరాం, 8.53 శాతం మంది మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, 12.28 శాతం మంది ఇతరులను కోరుకున్నారు.
ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు అంటే?
2014 లో తెరాసకు 34.30 శాతం ఓట్లు రాగా, ఈసారి 37.55 శాతం రానున్నట్లు సర్వేలో తేలింది. అంటే తెరాస బలం పెరిగింది. తెలుగుదేశం పార్టీకి 2014 లో 14.70 శాతం ఓట్లు రాగా ఇప్పుడు 5.66 శాతం ఓట్లే వస్తాయని తేలింది. ఆ పార్టీ ఓట్ల శాతం 9.04 శాతం తగ్గుతోంది. కాగా, ఈ సర్వేను బట్టి రాహుల్ గాంధీ, చంద్రబాబు పొత్తును తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లుగా ఈ సర్వేలో తేలింది.
తెలంగాణ సాధించిన క్రెడిట్ కేసీఆర్‌కు
తెలంగాణను సాధించిన క్రెడిట్ కేసీఆర్‌కే ఎక్కువ మంది ఇచ్చారు. తెలంగాణ సాధనలో తెరాస పాత్ర ఉందని 45.73 శాతం ప్రజలు చెప్పగా, కాంగ్రెస్ పాత్ర వైపు 32.90 శాతం ప్రజలు మొగ్గు చూపారు. తెలంగాణ వ్యతిరేక పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను హర్ట్ చేసిందని 52.44 శాతం ప్రజలు తెలిపినట్లు సర్వేలో తేలింది.

రాహుల్ గాంధీ కంటే మోడీ బెట్టర్
రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీలలో ఎవరు బెట్టర్ లీడర్ అని అంటే నరేంద్ర మోడీకి 33.61 శాతం ఓట్లు, రాహుల్ గాంధీకి 30.. ఓట్లు వచ్చాయి. ఇద్దరూ బెస్ట్ అన్న వారు 5.91 శాతం మంది ఉన్నారు. ఎవరికీ బెస్ట్ కాదన్న వారు 25.28 శాతం మంది ఉన్నారు.












Click it and Unblock the Notifications