కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రజాస్వామ్య పాలన: బీజేపీ లక్ష్యం అదేనంటూ రాహుల్ ఫైర్
నిర్మల్: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని నిర్మల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభకు రాహుల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సీఎం రేవంత్ సహా మంత్రులు, కాంగ్రెస్ నేతలు కూడా ఈ సభలో పాల్గొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను ఇచ్చామని, వాటిని పూర్తిగా అమలు చేస్తున్నామని రాహుల్ తెలిపారు. పేదల హక్కులను హరించి, పెద్దలకు ప్రయోజనం చేకూర్చడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. ప్రస్తుత ఎన్నికలు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయన్న రాహుల్ గాంధీ.. ఒకవైపు రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్ ఉంటే, మరోవైపు భారత రాజ్యాంగాన్ని మార్చే సమూహం ఉందని చెప్పుకొచ్చారు.

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని రాహుల్ గాంధీ ఆరోపించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉంది ప్రజల పక్షాన ఆలోచిస్తుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఉద్యోగం ఇస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఏడాదిపాటు నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. ఆదివాసీల భూ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఆశా, అంగన్వాడీ కార్యకర్తల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు రాహుల్ గాంధీ.
VIDEO | Lok Sabha Polls 2024: Here's what Congress leader Rahul Gandhi said in an election rally in Nirmal, Telangana.
— Press Trust of India (@PTI_News) May 5, 2024
"We will resolve the land issues of Adivasis. We will protect your rights of water, forest and land. I came to know that MNREGA is required here. You get 250… pic.twitter.com/JN7zSa10XT
తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు రూ.2500 బ్యాంక్ ఖాతాలో వేస్తామన్నారు. ఆరోగ్య భద్రత రూ.10 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని రాహుల్ హామీ ఇచ్చారు. పేదలకు రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నామని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిందని.. దేశంలోనూ వస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications