చంచల్ గూడ జైలుకు రాహుల్ - ఎన్‌ఎస్‌యూ నేతల పరామర్శ : చివరి నిమిషంలో..!!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో బిజీగా ఉన్నారు. రెండో రోజు షెడ్యూల్ లో భాగంగా ఆయన తాను బస చేసిన హోటళ్లో పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. మీడియా సంస్థల అధినేతలతో పాటుగా ప్రజా సంఘాల నేతలను కలిసారు. వారితో తెలంగాణ రాష్ట్ర - జాతీయ రాజకీయాల పైన చర్చించారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితుల పైన పలువురు రాహుల్ కు కొన్ని సూచనలు చేసారు. అదే సమయంలో కొన్ని నివేదికలు ఇచ్చారు.

రాష్ట్రంలో పరిస్థితులపై రాహుల్ ఆరా

రాష్ట్రంలో పరిస్థితులపై రాహుల్ ఆరా

గద్దర్‌, ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య, ప్రొఫెసర్‌ హరగోపాల్‌ లాంటి నేతలు ఆయన్ను కలిసి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించారు. ఆ తరువాత దివంగత సీఎం సంజీవయ్యకు నివాళులర్పించిన ఆయన.. అక్కడినుంచి నేరుగా చంచల్ గూడ జైలుకు వెళ్లారు. కొద్ది రోజులుగా జైళ్లో ఉన్న ఎన్‌ఎస్‌యూ నేతల ములాఖత్ కోసం టీపీసీసీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ, అనుమతి దొరకలేదు. ఈ ఉదయం కాంగ్రెస్ ఎంపీ..పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ మరోసారి ములాఖత్ కు దరఖాస్తు చేసారు. పోలీసుల నుంచి అనుమతి లభించింది.

చంచల్ గూడ జైళ్లో పరామర్శ

చంచల్ గూడ జైళ్లో పరామర్శ

దీంతో..చివరి నిమిషంలో జైలుకు వెళ్లేలా కార్యాచరణ ఖరారైంది. జైలు లోపలకు రాహుల్ తో పాటుగా మరొకరికి మాత్రమే అవకాశం ఇవ్వటంతో.. ఆయనతో పాటుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లోపలకు వెళ్లారు. అక్కడ ఎన్‌ఎస్‌యూ నేతలను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన పోరాటం చేసే వారికి పార్టీ పరంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఆ తరువాత ఆయన గాంధీ భవన్ చేరుకున్నారు. ప్రస్తుతం పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కొనసాగుతోంది.

పార్టీ నేతలకు దిశా నిర్దేశం

పార్టీ నేతలకు దిశా నిర్దేశం

ఈ తరువాత పార్టీ సభ్యత నమోదు కోఆర్డినేటర్లతో ఫొటో సెషన్ తర్వాత, సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. రాహుల్ పర్యటన..వరంగల్ సభ సక్సెస్ కావటంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. అదే సమయంలో పొత్తులు.. కాంగ్రెస్ నేతలకు స్పష్టమైన దిశా నిర్దేశం స్వయంగా రాహుల్ చేయటం ద్వారా ఇక, రాష్ట్రంలో పార్టీ నేతల్లో మార్పు వస్తుందనే చర్చ మొదలైంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ అన్నట్లుగా సాగుతున్న రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు .. రాహుల్ రాకతో కొత్త టర్న్ తీసుకున్నట్లుగా స్పష్టం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+