తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ రైళ్లు ఖరారు - రూట్, షెడ్యూల్ ఫిక్స్...!!
తెలుగు రాష్ట్రాలకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మరో రెండు వందేభారత్ రైళ్లకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్లకు ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. దీంతో.. కొత్తగా మరో రెండు వందేభారత్ రైళ్ల కు ఆమోదం లభించింది. దీపావళి నుంచి ఈ రైళ్లు పట్టాలెక్కున్నాయి. ఈ రెండు రైళ్లకు సంబంధించిన రూట్.. షెడ్యూల్ ను అధికారులు ఖరారు చేసారు.
తెలుగు రాష్ట్రాల నుంచి మరో రెండు వందేభారత్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. నాంపల్లి- పుణె, చర్లపల్లి-నాందేడ్ మధ్య ఈ కొత్త రైళ్లు నడుస్తాయి. నాంపల్లి-పుణె మధ్య వందేభారత్ రైలు సర్వీసును తీసుకురావాలని ఇటీవలే ప్రతిపాదన వచ్చింది. దానికి రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది. అదే సమయంలో చర్లపల్లి-నాందేడ్ మధ్య కూడా వందేభారత్ రైలును పట్టాలు ఎక్కేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి ఇప్పటికే 5 వందేభారత్ రైళ్లు నడుస్తుండగా ఇప్పుడు మరో రెండు చేరనుండడంతో ఆ సంఖ్య ఏడుకి చేరుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి 600 కిలోమీటర్లు దూరం ఉన్న ప్రాంతాలకే ఈ రైళ్ల సర్వీసులు కొనసాగుతున్నాయి. కొత్తగా మంజూరైన హైదరాబాద్-నాందేడ్ సర్వీసు మధ్య 281 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది.

ఇక, నాందేడ్‌లోని వ్యాపారులకు తెలంగాణతో వాణిజ్య సంబంధాలు బాగా ఉంటాయి. అలాగే, హైదరాబాద్-నాందేడ్ మార్గంలో నిజామాబాద్ పట్టణం ఉంటుంది. దీంతో అక్కడి వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నుంచి పుణ్యక్షేత్రం బాసరకు ప్రయాణీకుల రాకపోకల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక.. హైదరాబాద్ - పూణే మధ్య వందేభారత్ కోసం సుదీర్ఘ కాలం గా ప్రతిపాదన పెండింగ్ లో ఉంది.
ఈ నగరాల మధ్య 592 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొత్తగా వందేభారత్ కేటాయింపు ద్వారా 8 గంటల్లోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం కలుగుతుంది. చర్లపల్లి నుంచి పెద్ద సంఖ్యలో రైళ్ల రాకపోకలు సాగుతుండటంతో.. ఇప్పుడు చర్లపల్లి - నాందేడ్ మధ్య వందేభారత్ ఖరారు చేసారు. ఇక.. హైదరాబాద్ - పూణే మధ్య ప్రస్తుతం 17 రైళ్లు రాకపోక లు సాగిస్తున్నాయి. ఇతర రైళ్లకు పూణే వెళ్లేందుకు 12 గంటల వరకు సమయం పడుతోంది. ఇప్పుడు వందేభారత్ ద్వారా ప్రయాణీకులకు సమయం ఆదా కానుంది. దీపావళి నుంచి ఈ రెండు రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.
-
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
కవిత ఆశల పై కేటీఆర్ నీళ్లు, సెంటిమెంట్ అస్త్రం..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications