తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్: ఇకపై ఈ రైల్వే స్టేషన్లలోనూ ఆగనున్న ముఖ్యమైన రైళ్లు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుభవార్త చెప్పారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు ముఖ్యమైన రైళ్లను తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన స్టేషన్లలో ఆపాలంటూ దీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల ప్రజలు చేస్తున్న డిమాండ్లపై రైల్వే మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది.
కొద్ది రోజుల కిందటే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలుగు ప్రజల ఈ డిమాండ్లపై చర్చించారు. ఆయా స్టేషన్లలో వివిధ ముఖ్యమైన రైళ్లను ఆపడం ద్వారా ప్రజలకు కలిగే సౌకర్యం గురించి వివరించారు. దీనిపై అధికారులతో మాట్లాడారు రైల్వే మంత్రి. ఈ డిమాండ్లకు అంగీకరిస్తూ ఆయా రైల్వే స్టేషన్లలో వివిధ ప్రధానమైన రైళ్లను ఆపనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రంలోని బెల్లంపల్లి, సిర్పూర్-కాగజ్‌నగర్, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, గద్వాల్ రైల్వే స్టేషన్లలో సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు ముఖ్యమైన రైళ్లు ఇకపై ఆగనున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిడుగురాళ్ల, నడికుడి, సత్తెనపల్లి, డోర్నకల్, బొబ్బిలి, దువ్వాడ, పీలేరు స్టేషన్లలో వివిధ రైళ్లను ఆపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
ఇది ఇలా ఉండగా, ఇటీవల అమెరికా పర్యటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అక్కడి తెలుగువారు కలిశారు. హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికాకు విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని యూఎస్ఏ ఎన్నారైలు వినతి పత్రం అందించారు. ఢిల్లీ, ముంబై వంటి చాలా ఇతర భారతీయ నగరాలు ఇప్పటికే అమెరికాలోని ప్రధాన నగరాలకు నేరుగా విమాన కనెక్షన్లను కలిగి ఉన్నాయని తెలిపారు.

ఈ క్రమంలో యూఎస్ఏ-హైదరాబాద్ మధ్య నేరుగా విమానాలు నడపడం పట్ల పెద్ద నగరాలతో సమానంగా అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రవాసులు తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం కోసం ప్రపంచ దేశాలకు గమ్యస్థానంగా హైదరాబాద్ ఆకర్షణగా నిలుస్తుందన్నారు.
అమెరికా నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమాన మార్గాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని భారత పర్యాటక శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు ప్రవాస భారతీయులు. ఎయిర్ ఇండియా కొత్త ఫ్లైట్లను ఆర్డర్ చేయడంతోపాటు కొత్త రూట్లలో విమాన సర్వీసులను తెచ్చేందుకు కృసి చేస్తోందని.. కేంద్ర విమాన శాఖ మంత్రితో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా ప్రవాసుల కోరిక నెరవేరేలా చూస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications