హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్ అనుమానాలను నిజం చేసిన కేంద్రం- తెలంగాణకు బిగ్ ఝలక్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన భారత రాష్ట్ర సమితికి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలను విస్తరించుకుంటూ- కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్న బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు- ఊహించినట్టే ఝలక్ ఇచ్చింది. రాష్ట్రానికి మంజూరు కావాల్సిన మెగా ప్రాజెక్టును అస్సాంకు తరలించింది.

కేటీఆర్ అనుమానాలు..

కేటీఆర్ అనుమానాలు..

ఆ మెగా ప్రాజెక్ట్- రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. ఖాజీపేట్ లో ఈ కోచ్ ఫ్యాక్టరీని రైల్వే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సి ఉంది. తెలంగాణకు మంజూరైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అస్సాంకు తరలించిందంటూ ఇదివరకే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఖాజీపేట్ కు రావాల్సిన ఈ కోచ్ ఫ్యాక్టరీని- కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు అస్సాంలోని కోక్రాఝర్ కు తరలించిందంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

ఆ హామీ ఏమైంది?

ఆ హామీ ఏమైంది?

ఖాజీపేట్ లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటూ గతంలో కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి, ఇతర ఎంపీలు గొప్పలు చెప్పుకొన్నారని, ఇప్పడదే యూనిట్ అస్సాంకు తరలి వెళ్లిందని, దీనిపై ఏం చెబుతారంటూ కేటీఆర్ ఇదివరకే ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన ఓ మెగా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అస్సాంకు తరలించిందిని, దీనివల్ల బీజేపీ నేతలు చాలా సంతోషంతో ఉండొచ్చని ఎద్దేవా చేశారు. ఆ హామీ ఏమైందంటూ కేటీఆర్ నిలదీశారు.

24 గంటల్లోనే..

24 గంటల్లోనే..

కేటీఆర్ లేవనెత్తిన ఈ అంశంపై ఒకవంక బీజేపీ నేతలు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తోండగానే- కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. తెలంగాణాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయలేమని రాజ్యసభలో తేల్చి చెప్పింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీల సంఖ్య సంతృప్తికర స్థాయిలో ఉందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. భవిష్యత్తు అవసరాలకు చాలినన్ని కోచ్‌లను తయారు చేసే సామర్థ్యం ఇప్పుడున్న యూనిట్లకు ఉందని వివరణ ఇచ్చారు.

సురేష్ రెడ్డికి సమాధానం.

సురేష్ రెడ్డికి సమాధానం.

రాజ్యసభలో బీఆర్ఎస్ సభ్యుడు సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు అశ్విని వైష్ణవ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఇప్పుడున్న కోచ్ ఫ్యాక్టరీల్లోనే వందేభారత్ బోగీలు కూడా తయారవుతున్నాయని పేర్కొన్నారు. ఖాజీపేట్ లో ప్రతిపాదిత కోచ్ ఫ్యాక్టరీ పనులను ప్రారంభించలేమని స్పష్టం చేశారు. అక్కడ కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పలేమని లిఖితపూరకంగా స్పష్టం చేశారు.

పులివెందులలో జగన్: వైఎస్సార్ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు..!!పులివెందులలో జగన్: వైఎస్సార్ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు..!!

English summary
Railway minister Ashwini Vaishnaw given a clarification in Rajya Sabha on the demand of Railway Coach Factory to set up in Telangana's Khajipet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X