ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు.. ట్రైన్‌లో కేంద్ర మంత్రి.. ఢీ కొట్టకుండా చేసిన "కవచ్" !!

దేశంలో రైలు ప్రమాదాలను తరచూ జరుగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల ట్రాక్ తప్పి ప్రమాదాలు జరుగుతుండ‌గా.. మరికొన్ని ఒకే ట్రాక్‌పై రెండు ట్రైన్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీకొని ప్రమాదాలు సంభవించిన సందర్భాలు ఉన్నాయి. దీంతో అనేక మంద్రి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌ల‌ను ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కవచ్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది

ఆటోమేటిక్ ట్రైనన్ ప్రొటెక్షన్ వ్యవస్థ

రైల్వేలో సున్నా ప్రమాదాలే లక్ష్యంగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైనన్ ప్రొటెక్షన్ వ్యవస్థను రైల్వేలో ప్రవేశపెట్టనున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిదిలోని సికింద్రాబాద్ - వాడి- ముంబై మార్గంలో ఈ కవచ్ అనే రక్షణ వ్యవస్థను అమలులోకితేనుంది. అందులో భాగంగా ప్రయోగాత్మకంగా లింగంపల్లి-వికారాబాద్ సెక్షన్‌ను ఈ కవచ్ పరిధిలోకి తెచ్చారు. ఈ వ్యవస్థ పనితీరును ట్రాక్‌పై ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ సెక్షన్‌లో కవచ్ టెస్ట్ రైడ్‌ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా పరిశీలించారు. ఒకే ట్రాక్‌పై రెండు ట్రైన్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఆటోమెటిక్‌గా రైళ్లు ఆగిపోవడానికి ప్రత్యక్షంగా చూశారు.

క‌వ‌చ్‌ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు

ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ ఉన్న ట్రాక్‌లో ప్రత్యేకమైన సెన్సార్లు అమర్చుతారు. ఈ సెన్సార్ల వల్ల ఒకే ట్రాక్ పై రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు లేదా.. ఒకదాని వెనుక మరొకటి వేగంగా వస్తూ.. ఢీ కొట్టే సందర్భాల్లో ఇవి పని చేస్తాయి. ప్రమాదాలను పూర్తిగా నివారిస్తాయి. ప్రమాదాలను ముందే పసిగట్టే వ్యవస్థలు రైళ్లను ఆటోమేటిక్ గా ఆపేస్తాయి. అంతే కాదు... రెడ్ సిగ్నల్ ఉన్నా పట్టించుకోకుండా రైలు దూసుకువస్తుంటే వెంటనే కవచ్ యాక్టివేట్ అవుతుంది. కవచ్ రక్షణ వ్యవస్థ ట్రైన్ వేగాన్ని ఒక్కసారిగా నిలిపివేస్తుంది. ఈ వ్యవస్థ అధిక ఫ్రీక్వేన్సి రేడియో కమ్యూనికేషన్ ఉపయోగించడం ద్వారా పనిచేస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.

రైలు ప్రమాదాల నివార‌ణ‌

రైలు ప్రమాదాలను నివారించాలన్న లక్ష్యంతో ఆత్మనిర్భన్ భారత్ కార్యక్రమంలో భాగంగా 2022 యూనియన్ బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలుత 2వేల కిలోమీటర్ల పరిధిలో రైల్వే నెట్‌వర్క్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక ప్రపంచ స్థాయి టెకాలజీని కవచ్ కింద తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటివరకు కవచ్ వ్యవస్థ కింద 1098 కి.మీ దక్షిణ మధ్య రైల్వే యొక్క ఆనో గోయింగ్ ప్రాజెక్టులలో 65లోకోలలో ప్రవేశపెట్టారు. దేశ వ్యాప్తంగా ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే రైలు ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అధికారుల పనితీరును ప్రశంసించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+