సికింద్రాబాద్ నుంచి రైళ్ల పునరుద్దరణ పై కీలక అప్డేట్..!!

సికింద్రాబాద్ స్టేషన్ రూపు రేఖలు మారిపోతున్నాయి. విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకుంటోంది. అభివృద్ధి పనులు చివరి దశకు వచ్చాయి. ఇక్కడ పనుల కారణంగా పలు ప్రధాన రైళ్లను చర్లపల్లికి మార్పు చేసారు. దీంతో, ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. కాగా, సికింద్రాబాద్ నుంచి తిరిగి రైళ్లు పూర్తి స్థాయిలో పునరుద్దరణ.. స్టేషన్ నుంచి రాకపోకలు గతంలో మాదిరి నిర్వహణ పైన రైల్వే నుంచి కీలక అప్డేట్ అందుతోంది.

కేంద్ర రైల్వే శాఖ సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించింది. దాదాపుగా రూ.714 కోట్లను రైల్వే కేటాయించింది. ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలతో స్టేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఇక్కడ పనుల కారణంగా పలు రైళ్లను చర్లపల్లికి మార్పు చేసారు. చర్లపల్లి స్టేషన్ ను సైతం పూర్తి స్థాయి సౌకర్యాల తో తీర్చి దిద్దారు. సికింద్రాబాద్ పైన రైళ్ల భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా కొన్ని రైళ్లను నాంపల్లి, కాచిగూడ, లింగం పల్లికి మార్పు చేసారు. అయితే.. సికింద్రాబాద్ నుంచి రాకపోకలకు ప్రయాణీకులు అలవాటు పడ్డారు. ఇప్పుడు చర్లపల్లికి వెళ్లటం పలు ప్రాంతాల నుంచి వచ్చే వారికి సమస్యగా మారుతోంది.

Railway Officials Reveal New Plans to Resume Train Services from Secunderabad

అయితే, సికింద్రాబాద్ స్టేషన్ లో తిరిగి ఆపరేషన్స్ ప్రారంభం అయినా.. కొన్ని రైళ్లు చర్లపల్లి నుంచే కొనసాగనున్నాయి. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో నిత్యం 250 జతల రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇప్పటికే ఆరు జతల రైళ్లను చర్లపల్లి టెర్మినల్‌కు శాశ్వతంగా మళ్లించారు. మరో 26 జతల రైళ్లను తాత్కాలిక పద్ధతిలో ఇతర స్టేషన్ల మీదుగా నడుపుతున్నారు.

కాగా, రైల్వే శాఖ సికింద్రాబాద్ లో అభివృద్ధి పనులన్నీ పూర్తయిన తర్వాత ప్రస్తుతం నడుస్తున్న రైళ్లతో పాటుగా మళ్లించిన రైళ్లను ఈ స్టేషన్ మీదుగా మాత్రమే కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక.. తాజాగా చేస్తున్న మార్పులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో మొత్తం 26 లిఫ్టులతోపాటు 32 ఎస్కలేటర్లు, రెండు ట్రావెలేటర్లు ఉంటాయి.

కొత్త ప్లాన్లలో భాగంగా మెట్రో రైలుకు వెళ్లేందుకు మల్టీమోడల్ కనెక్టివిటీని తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం బేస్ మెంట్1, బేస్ మెంట్ 2కు సంబంధించిన స్లాబ్ పనులు పూర్తయ్యాయి. ఆర్పీఎఫ్ భవనం, ప్లంబింగ్, స్ట్రక్చరల్ పనులు కూడా పూర్తయ్యాయి. విమానాశ్రయ తరహాలో ప్రయాణికుల కు సౌకర్యాలు కల్పిస్తున్నారు. పనులన్నీ పూర్తయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ స్టేషన్ ను జాతికి అంకితం చేస్తారు.

సికింద్రాబాద్ స్టేషన్ తిరిగి పూర్తి స్థాయిలో పునరుద్దరణ అయ్యే నాటికి ప్రస్తుతం కొనసాగుతున్న వాటితో పాటుగా.. మళ్లించిన రైళ్లను మాత్రమే ఈ స్టేషన్ మీదుగా తిరిగి అనుమతించేలా కసరత్తు జరుగుతోంది. ఇక.. చర్లపల్లి, లింగంపల్లి నుంచి రాకపోకలు సాగిస్తున్న రైళ్ల విషయంలో మార్పు ఉండదని తెలుస్తోంది. జనవరి సంక్రాంతి సమయం నుంచి సికింద్రాబాద్ స్టేషన్ తిరిగి పూర్తి స్థాయి ఆపరేషన్స్ తో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+