సికింద్రాబాద్ నుంచి ఈ రైళ్లూ మళ్లింపు, పునరుద్దరణ అప్పుడే..!!
దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక ప్రకటన చేసారు. సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనుల కారణంగా ఇప్పటికే ఇక్కడ నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లను చర్లపల్లి నుంచి కొనసాగుతున్నాయి. కాగా, కొన్ని ప్రధాన రైళ్లను మాత్రం సికింద్రాబాద్ నుంచి రాకపోకలు కొనసాగి స్తున్నాయి. అయితే, ఇప్పుడు రైల్వే అధికారులు మరిన్ని రైళ్లను సికింద్రాబాద్ నుంచి మార్పు చేసారు. ఇతర స్టేషన్ల నుంచి మళ్లింపు చేసారు. ఈ మేరకు రైల్వే అధికారులు స్పష్టత ఇచ్చారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నందున వేర్వేరు ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చే పలు రైళ్లను అక్టోబరు 19వ తేదీ వరకు ఇతర స్టేషన్లకు మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. తిరిగి అదే స్టేషన్ నుంచి రైళ్లు బయలుదేరుతాయని ఓ ప్రకటనలో వెల్లడించారు. విజయవాడ నుంచి వెళ్లే (12713, 12714) రైళ్లు కాచిగూడ స్టేషన్‌కు, పోరుబందర్ నుంచి (వీక్లీ) వచ్చి వెళ్లే (20967, 20968) రైళ్లు ఉందానగర్‌కు, సిద్దిపేట నుంచి వచ్చి వెళ్లే (77656, 77653, 776754, 77655) రైళ్లను మల్కాజ్‌గిరికి మళ్లించినట్టు అధికారులు వివరించారు. రాకపోకలు ఇదే రూటులో ఉంటాయని వెల్లడించారు.

అదే విధంగా పుణె నుంచి వచ్చి వెళ్లే (12025, 12026) రైళ్లు హైదరాబాద్ స్టేషన్ నుంచి.. మణుగూరు (12745, 12746) రైళ్లు, రేపల్లె నుంచి వచ్చి వెళ్లే (17645, 17646) రైళ్లు చర్లపల్లి నుంచి నడుస్తాయన్నారు.. దూర ప్రాంతాలకు వారానికోసారి, రెండు, మూడు సార్లు నడిచే పలు రైళ్లు.. సిల్చార్ (12513, 12514), దర్భంగ (17007, 17008), యశ్వంత్‌పూర్ (12735, 12736) రైళ్లు చర్లపల్లి నుంచి.. అగర్తల (07029, 07030), ముజఫర్‌పూర్ (05293, 05294), సంత్రాగచి (07221, 07222), దనపూర్ (07647, 07648), రామేశ్వరం (07695, 07696), హైదరాబాద్ రాక్సౌల్ (07051, 07052) రైళ్లు చర్లపల్లి టెర్మినల్ నుంచి నడుస్తాయని రైల్వే అధికారులు వివరించారు.












Click it and Unblock the Notifications