శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, చర్లపల్లి - తిరుచానూరు ప్రత్యేక రైళ్లు: రూట్.. షెడ్యూల్..!!

శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వరుస సెలవులు.. పండుగల వేళ రద్దీ ఎక్కువ గా ఉండటంతో చర్లపల్లి- తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్ల తేదీలతో సహా హాల్టింగ్ స్టేషన్లు.. షెడ్యూల్ ను వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణీకులకు వీలుగా ఈ రైళ్లను ఏర్పాటు చేసారు. ఈ ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-తిరుచానూరు (తిరుపతి) మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. 07025 ప్రత్యేక రైలు ఈనెల 4న చర్లపల్లి నుంచి తిరుచానూరుకు, 07026 ప్రత్యేక రైలు 5న తిరుచానూరు నుంచి చర్లపల్లికి నడుస్తాయని పేర్కొన్నారు. అలాగే 9న హైదరాబాద్‌-మంగళూరుల మధ్య 07097, 10న మంగళూరు-హైదరాబాద్‌ మధ్య 07098 నంబర్‌ గల ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు తెలిపారు. ఈ స్పెషల్ ట్రైన్స్ రెండు దిశలలోనూ మార్గమధ్యంలో ప్రయాణికులకు అనువుగా పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. తెలంగాణలోని నల్లగొండ, మిర్యాలగూడ, ఏపీలోని గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లురూ, రేణిగుంట స్టేషన్లలో ఆగనున్నట్లు అధికారులు తెలిపారు.

railways-announces-special-trains-for-cherlapalli-to-tiruchanur-during-holidays-here-the-schedule

రైల్వే శాఖ తాజా నిర్ణయంతో

కాగా, ఈ ప్రత్యేక రైళ్లల్లో 1AC కమ్ 2AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది దక్షిణ మధ్య రైల్వే. ఈ నెల 4వ తేదీ నుంచి వరుసగా మూడు రోజులు పాఠశాలలు, కార్యాలయాలకు సెలవులు. దీంతో.. తిరుమలకు వెళ్లే వారి రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందునా శ్రావణ మాసం కావటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు. ఈ నెలలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. దీనికి అనుగుణం గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాణిస్తున్న రెగ్యులర్ రైళ్లలో కొనసాగుతున్న వెయిటింగ్ లిస్టుతో ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ప్రయాణీకుల స్పందనకు అనుగుణంగా కొనసాగింపు పైనా నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+