తెలంగాణా జిల్లాలలో వర్షబీభత్సం: కరీంనగర్లో రేవంత్ రెడ్డి సభ రద్దు; ఎక్కడ ఏం జరిగిందంటే
నిన్నటివరకు నిప్పుల కుంపటిని తలపించిన తెలంగాణా ఒక్కసారిగా చల్లబడింది, ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో వర్షం కురిసింది. అయితే ఈదురుగాలులతో కూడిన వర్షాల వలన మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవటంతో రైతులు ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్ లోనూ వర్ష బీభత్సం కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో వర్ష బీభత్సం వివరాల్లోకి వెళితే
కరీంనగర్ లో భారీ వర్షం
కరీంనగర్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లొ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ ప్రాంగణం లొ నీరు చేరింది. దీంతో సభా ప్రాంతం లొ వేసిన టెంట్లు కూలిపోయాయి. అక్కడ ఎవరు లేకపోవడం తో ఎటువంటి అపాయం జరగలేదు.

రేవంత్ రెడ్డి కరీంనగర్ పర్యటన రద్దు
భారీ వర్షం తో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో భారీ వర్షం నేపథ్యంలో CM రేవంత్ రెడ్డి కరీంనగర్ పర్యటన రద్దైంది. కరీంనగర్ లో వివిధ ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి పోవడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది.

వరంగల్ లోనూ వర్ష బీభత్సం
వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వర్ధన్నపేట మండలం కటిర్యాల గ్రామ శివారులో గాలివాన బీభత్సవానికి జాతీయ రహదారిపై భారీ వృక్షం కూలిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో కొనుగోలు కేంద్రంలో నిలువచేసిన వరి ధాన్యం భారీ వర్షానికి తడిసి ముద్దవ్వడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వేములవాడలో ప్రధాని సభ ఏర్పాట్లు చెల్లాచెదురు
నర్సంపేటలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు.కొత్తగూడ. గంగారం మండల్లాలో మోస్తారు వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు సాయంత్రం భారీ వర్షం కురిసింది. జిల్లాలోని పలు మండలాలతో పాటు వేములవాడ పట్టణంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం.కురిసింది. రేపు ప్రధాని పర్యటన కోసం ఏర్పాటు చేసిన సభ కోసం ఏర్పాట్లు చెల్లాచెదురయ్యాయి.
వాంకిడిలో ఇళ్ళలోకి చేరిన వర్షపు నీరు
ఆసిఫాబాద్ జిల్లాలో భారీవర్షం కురిసింది. కాగజ్ నగర్ డివిజన్ లోని కాగజ్ నగర్ పట్టణంతో పాటు దహేగాం, బెజ్జూర్, పెంచికలపేట, కౌటాల, సిర్పూర్(టి) మధ్యాహ్నం వరకు ఈదురు గాలులు వడగళ్ళతో కూడిన భారీ వర్షం కురియగ మధ్యాహ్నం తరువాత ఆసిఫాబాద్ డివిజన్లోని ఆసిఫాబాద్, వాంకిడి, కెరమేరి, తిర్యాని, జైనూర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది.వాంకిడి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నీరు ఇండ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పిడుగు పడి ఎద్దు మృతి, తాటిచెట్టుపై పిడుగుపాటు
కౌటాల మండలం నాగవెల్లి గ్రామానికి చెందిన మొహర్ల దసరు కు చెందిన ఎద్దు పిడుగు పడి మరణించింది. దహేగాం మండల కేంద్రంలో తాటి చెట్టుపై పిడుగు పడటంతో అది కాలిపోయింది. మంచిర్యాల జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలుల తో కూడిన వర్షం పడింది..జిల్లాలోని కోటపల్లి, చెన్నూరు, జైపూర్, హజీపూర్ మండలాల్లో వర్షం కురిసింది. మెదక్ జిల్లాలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. కొన్ని ప్రాంతాలలో వడగళ్ళ వాన కురిసింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications