• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

దంచికొట్టిన వాన.. పట్టపగలే కారుచీకట్లు: ఆ 2గంటలు బీభత్సం..

|

హైదరాబాద్: భగ్గుమంటున్న ఎండలు, ఉక్కపోతతో సతమతమవుతున్న నగరజీవికి గురువారం కురిసిన వర్షం కాస్త ఉపశమనం ఇచ్చింది. గాలివాన కారణంగా గురువారం నాడు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 40.5డిగ్రీల నుంచి 24డిగ్రీలకు పడిపోవడం గమనార్హం. అయితే గాలివాన బీభత్సంతో పలుచోట్ల ప్రమాదాలు కూడా సంభవించాయి. విదర్భ-ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ మీదుగా ఉపరిత ద్రోణి ఏర్పడటంతో పాటు బంగాళాఖాతం మీదుగా వీస్తున్న తేమగాలుల కారణంగా వర్షం కురిసినట్టు వాతావరణ నిపుణులు తెలిపారు.

2గంటలు.. కారుచీకట్లు:

2గంటలు.. కారుచీకట్లు:

మధ్యాహ్నాం 2గం. సమయంలో నగరంలోని చాలా ప్రాంతాలను మబ్బులు కమ్మేశాయి. ఉధృతంగా వీచిన గాలులకు చాలాచోట్ల హోర్డింగులు కూలిపోయాయి. అక్కడక్కడా చెట్లు విరిగిపడగా, విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో చాలాచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మబ్బులు కమ్మేయడంతో మధ్యాహ్నాం పూటే కారుచీకట్లు అలుముకున్నాయి.

అక్కడక్కడా వడగళ్లు:

అక్కడక్కడా వడగళ్లు:

రెండు గంటల వాన బీభత్సానికి వీఎస్టీ సమీపంలోని డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో ప్రధాన రహదారిపైకి భారీగా నీరు వచ్చి చేరింది. చాలాచోట్ల మురుగునీరు రోడ్ల పైకి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎల్బీనగర్, బేగంపేట తదితర ప్రాంతాల్లో స్వల్ప పరిమాణంలో వడగళ్లు పడ్డాయి. రెండు గంటల్లో సగటున 2సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

ఇద్దరు మృతి..:

ఇద్దరు మృతి..:

గురువారం ఉరుములు మెరుపులతో కురిసిన గాలివాన గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ముగ్గురి ప్రాణాలు బలిగొన్నది. కర్మన్ ఘాట్ సమీపంలోని అంజిరెడ్డినగర్ కి చెందిన ఇంద్రావత్ అఖిల్(7) చెట్టుపై పిడుగు పడటంతో మృతి చెందాడు. ఆ సమయంలో అతను చెట్టుకు ఉయ్యాల కట్టుకుని ఆడుతున్నట్టు సమాచారం. ఇక ఆరాంఘర్ ప్రాంతంలోని ఓ గోదాం గోడ కూలిపోవడంతో పరుశురాం అనే మరో వ్యక్తి కూడా మృతి చెందాడు. గాలివాన కారణంగా పలుచోట్ల పలువురు గాయాలపాలయ్యారు.

క్యుములోనింబస్ వల్లే:

క్యుములోనింబస్ వల్లే:

విదర్బ-ఛత్తీస్ ఘడ్-తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనానికి తోడు, బంగాళాఖాతం మీదుగా వీస్తున్న తేమ గాలులు క్యుములోనింబస్ మేఘాలు ఉధృతంగా ఏర్పడటానికి కారణమంటున్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న సమయంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతాయని, దానికి ఉపరితల ద్రోణి కూడా తోడవడంతో గాలివాన బీభత్సం సృష్టించిందంటున్నారు. కాగా, రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rains lashed the city on Thursday bringing much relief from the scorching heat. The sudden downpour in the city also brought down the mercury level from 40.5 degree Celsius to 24 degree Celsius by Thursday evening.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more