టీఎస్ఆర్టీసీ బిల్లు ఆమోదానికి టైం పడుతుంది, ఎందుకంటే?: రాజ్‌భవన్ క్లారిటీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన ఆర్టీసీ బిల్లును రాజ్‌భవన్ పెండింగ్ ఉంచింది. బిల్లు పరిశీలనకు మరికొంత సమయం అవసరమని గవర్నర్ ప్రెస్ కార్యదర్శి ఒక ప్రకనటలో వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఇంకా అనుమతి
ఇవ్వని క్రమంలో ఈ మేరకు వివరణ ఇచ్చారు.

అసెంబ్లీ సమావేశాలు మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో 2వ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటలకు రాజ్ భవన్‌కు బిల్లు చేరిందని పేర్కొన్నారు. ఆర్టీసీ బిల్లును పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని, న్యాయసలహా తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజ్ భవన్ స్పష్టం చేసింది.

 Raj Bhavan

కాగా, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన బిల్లు ఆర్థిక బిల్లు కావడంతో గవర్నర్‌ వద్దకు పంపించారు. రాష్ట్ర కేబినేట్‌ రూపొందించిన బిల్లును యుద్ధ ప్రాతిపదికన రెండు రోజుల క్రితమే ప్రభుత్వం రాజ్​‌భవన్‌కు పంపింది. అయితే, ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ ఆమోదం లభించలేదు. ఒక వేళ తమిళిసై అనుమతి లభిస్తే ఇతర బిల్లులతో పాటు ఈ బిల్లు కూడా శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ముందుగా భావించింది. గవర్నర్ నుంచి ఎటువంటి అనుమతి రాకపోవడంతో ఎజెండాలో పొందుపరచలేదు.

మరోవైపు, అసెంబ్లీ సమావేశాలు శనివారంతో ముగిస్తుండటంతో ఇప్పటి వరకు ఈ బిల్లుపై ఎటువంటి స్పష్టత రాలేదు. ఇప్పటికే బిల్లు పంపి రెండు రోజులైనా అనుమతి ఇవ్వకపోవడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ప్రభుత్వం, కార్మికులను ఇబ్బందిపెట్టాలనే ఉద్దేశంతోనే గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలు, పేదలే అధికంగా ఉన్నారని చెబుతున్నారు. ఇటీ బీఆర్ఎస్, మరోవైపు కార్మిక సంఘాలు బిల్లు త్వరగా ఆమోదించాలని కోరుతున్నారు. లేదంటే అసెంబ్లీ సమావేశాలు పొడిగించాల్సి వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+