రేవంత్ కు పోటీగా రాజగోపాల్ - హైకమాండ్ వద్ద కీలక ప్రతిపాదన..!!

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raja Gopal Reddy)కాంగ్రెస్ లో చేరటం ఖాయమైంది. బీజేపీకి రాజీనామా చేసిన రాజగోపాల్ ఈ నెల 27న కాంగ్రెస్ లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. కొద్ది రోజులగా బీజేపీ వ్యవహారాలకు రాజగోపాల్ దూరంగా ఉంటున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో మంతనాల ద్వారా పార్టీలో ఎంట్రీ..సీటును ఖరారు చేసుకున్నారు. ఇదే సమయంలో పార్టీలో ముఖ్యనేతలతో ఉన్న పరిచయాలతో కొత్త ప్రతిపాదన వారి ముందు ఉంచారు. రేవంత్(Revanth Reddy) తో పోటీ పడుతున్నట్లు చర్చ మొదలైంది.

రాజగోపాల్ ప్రతిపాదన: కాంగ్రెస్ లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. కాంగ్రెస్ లో ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పని చేసిన రాజగోపాల్ రెడ్డి పార్టీలో పరిణామాలతో రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లారు. మునుగోడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సస్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా కాంగ్రెస్ లో పొలిటికల్ వార్ కొనసాగింది.

Raja Gopal Reddy latest proposal before AICC, he wants to contest from Gajwel against CM KCR

ఇక, ఇప్పుడు వ్యూహాత్మకంగా ఎన్నికల సమయంలో రాజగోపాల్ ఢిల్లీ వేదికగా తన వ్యూహాలకు పదును పెట్టారు. తిరిగి కాంగ్రెస్ లోకి చేరటానికి లైన్ క్లియర్ చేసుకున్నారు. తిరిగి మునుగోడు సీటు దక్కేలా ఒప్పించుకున్నారు. ఇదే సమయంలో మరో కొత్త ప్రతిపాదన పార్టీ అగ్ర నాయకత్వం ముందు ఉంచారు. తాను మునుగోడుతో పాటుగా గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రతిపాదించారు.

కేసీఆర్ పై పోటీ చేస్తా: గజ్వేల్ నుంచి కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్దిని ఖరారు చేసింది. అయితే, తాను పోటీకి సిద్దమని రాజగోపాల్ ప్రతిపాదన చేసారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ ఈ సారి కొడంగల్ తో పాటుగా కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీంతో, రేవంత్ కు ధీటుగా తాను గజ్వేల్ నుంచి కేసీఆర్ పైన పోటీకి రాజగోపాల్ రెడ్డి సిద్దమైనట్లు విశ్లేషణలు మొదలయ్యాయి.

అటు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ తన నియోజకవర్గం హుజూరాబాద్ తో పాటుగా కేసీఆర్ పైన గజ్వేల్ నుంచి పోటీలో నిలుస్తున్నారు. అయితే, కామారెడ్డి నుంచి తానే బరిలో నిలుస్తానని షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. షబ్బీర్ అలీ సీనియర్ నేత కావటంతో కామారెడ్డి ఆయనకే కేటాయిస్తారనే అభిప్రాయం తొలి నుంచి ఉంది. అయితే, తొలి జాబితాలో షబ్బీర్ అలీ పేరు లేకపోవటంతో సందేహాలు మొదలయ్యాయి.

సఖ్యత కుదిరేనా:అయితే, రాజగోపాల్ ప్రతిపాదన పైన పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక..రాజగోపాల్ కాంగ్రెస్ లో చేరటం పైన బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజగోపాల్ తొందరపడి నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, రాజగోపాల్ మాత్రం తెలంగాణను విముక్తి చేయాలనే తన ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బిజెపి, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను భావిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే నేను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు రాజగోపాల్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+