వెనుకడుగు వేయను : కేసీఆర్ పై యుద్దానికి సిద్దం - తేల్చేసిన రాజగోపాల్..!!

తెలంగాణ రాష్ట్రాన్ని.. సొంత ఆస్తిగా మార్చుకున్న కేసీఆర్‌పై అతి త్వరలో యుద్ధ ప్రకటన చేయతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి త్వరలో బీజేపీలో చేరుతారనే ప్రచారం నేపథ్యంలో ఆయనే తాజాగా ప్రకటన విడుదల చేసారు. టీఆర్‌ఎస్‌ రాక్షస పాలన నుంచి విముక్తి చేసే దిశగా తాను వేస్తున్న అడుగులో రాజీ పడే ప్రసక్తి లేదని, వెనకడుగు వేయడం తన రక్తంలోనే లేదని పేర్కొన్నారు. దీని ద్వారా ఒకటి రెండు రోజుల్లోనే ఆయన బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

నా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు

నా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు


మునుగోడు ప్రజలు, మేధావులు, కవులు, కళాకారులు, యువజన, విద్యార్థి, ఉద్యోగ వర్గాలన్నీ తన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్‌ నియంత పాలనకు చరమగీతం పాడేందుకు మరో కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమని, సమరశంఖం పూరిస్తామని ప్రకటించారు. వందల కోట్ల డబ్బు సంచులతో వచ్చే కేసీఆర్‌.. ఆయన కౌరవసేనను ఎదిరించి ప్రజాప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకెళ్లాలని నిర్ణయించామన్నారు. ఎన్నికలు వస్తేనే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసే ముఖ్యమంత్రి.. ఉద్దేశపూర్వకంగానే మునుగోడు నియోజకవర్గపై కక్ష కట్టారని ఆరోపించారు.

రాజీనామాపై గతంలోనే చెప్పాను

రాజీనామాపై గతంలోనే చెప్పాను


మూడున్నరేళ్లుగా తనతో పాటు నియోజకవర్గ ప్రజలను అనేక రకాలుగా అవమానపరిచి, అభివృద్ధి పనులను నిలిపివేశారని విమర్శించారు. సొంత అవసరాల కోసమో, పదవుల కోసమో చేస్తున్న పోరాటం తనది కాదన్నారు. ఇప్పటికే సన్నిహితులు, ముఖ్యనాయకులు, ప్రజా ప్రతినిధులతో అన్ని విషయాలు చర్చించే కేసీఆర్‌ పాలనపై సమరశంఖం పూరించాలని నిర్ణయించామన్నారు. హుజూరాబాద్‌ మాదిరిగా అన్ని పథకాలు అమలు చేస్తే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని ఇంతకుముందే చెప్పానని గుర్తుచేశారు.

యుద్దానికి సిద్దమంటూ క్లారిటీ

యుద్దానికి సిద్దమంటూ క్లారిటీ


సొంత ఆస్తులు పెంచుకుంటూ, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అన్ని వర్గాలకు కేసీఆర్‌ తీరని ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలు వస్తేనే అభివృద్ధి- సంక్షేమ పథకాలను అమలు చేసే సీఎం.. మునుగోడుపై కక్షగట్టి మూడున్నరేళ్లుగా నిధులు మంజూరు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు 90శాతం పనులు 2014 కంటే ముందే పూర్తయినా... తనను గెలిపించారన్న అక్కసుతో దాన్ని పక్కకుపెట్టారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్‌.. ప్రజలకు తీరని ద్రోహం చేశారని దుయ్యబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+