ఇక ఇదే నా లక్ష్యం - రాజీనామా ఆమోదం వేళ తేల్చేసిన రాజాసింగ్..!!
బీజేపీ తో రాజాసింగ్ బంధం ముగిసింది. బీజేపీ నుంచి వరుసగా గెలిచిన రాజాసింగ్ రాజీనామా ను పార్టీ చీఫ్ ఆమోదించారు. ఇక, ఇప్పుడు రాజాసింగ్ ఎమ్మెల్యే పదవి పైన అనర్హత వేటు దిశగా పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తోంది. తన రాజీనామా ఆమోదం పైన రాజాసింగ్ స్పందించారు. ఒకింత ఎమోషనల్ అయ్యారు. బీజేపీతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీ అధికారంలోకి రావాలనే తన ఆలోచనను పంచుకున్నారు. ఇక, తన భవిష్యత్ లక్ష్యం ఏంటో తేల్చి చెప్పారు.
బీజేపీకి రాజాసింగ్ చేసిన రాజీనామాను పార్టీ ఆమోదించింది. ఈ నిర్ణయం పైన రాజాసింగ్ స్పందించారు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం తాను బీజేపీలో చేరానని గుర్తు చేసుకున్నారు. ప్రజలకు సేవ చేయడం, దేశానికి సేవ చేయడం మరియు హిందూత్వాన్ని రక్షించడం అనే లక్ష్యంతో.. తాను బీజేపీలో చేరానని పేర్కొన్నారు. బీజేపీ తనపై విశ్వాసం ఉంచి, వరుసగా మూడుసార్లు గోషామహల్ నియోజకవర్గం నుండి పార్టీ టికెట్ ఇచ్చిందని వివరించారు. తన విజయానికి సహకరించి.. తనకు మద్దతుగా నిలిచిన పార్టీ నేతలకు రాజాసింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు తన రాజీనామాను పార్టీ చీఫ్ నడ్డా ఆమోదించారని చెప్పారు.

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కలతో పగలు మరియు రాత్రి అవిశ్రాంతం పనిచేస్తున్న లక్షలాది మంది బీజేపీ కార్యకర్తల బాధ ..పోరాటాలను తాను ఢిల్లీ నాయకత్వానికి తెలియజేయలేకపోయానన్నారు. తాను ఏ పదవి .. వ్యక్తిగత లాభం కోసం తీసుకోలేదని స్పష్టం చేసారు. తాను హిందుత్వకు సేవ చేయటానికే పుట్టానని.. తన చివరి శ్వాస వరకు దాని కోసమే పని చేస్తానని తేల్చి చెప్పారు. పూర్తి అంకితభావం మరియు నిజాయితీతో, తాను ఎప్పుడూ హిందూత్వం తో పాటుగా జాతీయవాదం .. సనాతన ధర్మ రక్షణ కోసం పని చేస్తానని ప్రకటించారు. సమాజ సేవ ..హిందూ సమాజ హక్కుల కోసం తన చివరి శ్వాస వరకు నా గొంతును వినిపిస్తూనే ఉంటానని రాజాసింగ్ స్పష్టం చేసారు. ఇక, రాజకీయంగా రాజాసింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ఏ పార్టీలోకి ఎంట్రీ ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications