హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘పుష్ప’ సాంగ్ ఎఫెక్ట్ -మ్యూజిక్ డైరెక్ట్ దేవీశ్రీ కి రాజాసింగ్ వార్నింగ్ : క్షమాపణ చెప్పాలి..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించి..విడుదలైన "పుష్ప" మూవీ ని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీ రివ్యూల విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అభిమానులు మాత్రం తమ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా మూవీ ఉందంటూ ఖుషీ అవుతున్నారు. ఇక, ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ ఇప్పుడు వివాదంగా మారుతోంది. సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌‌లో భాగంగా చిత్రబృందంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కూడా హాజరయ్యారు.

ఈ క్రమంలో ఐటమ్ సాంగ్స్ 'రింగ రింగా..', 'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా' ఈ రెండు పాటలను భక్తి పాటలగా మార్చి పాడారు. అంతటితో ఆగని ఆయన.. ఐటెం సాంగ్స్, దేవుళ్ల పాటలు త‌న దృష్టిలో ఒక్కటే అని చెప్పడం గమనార్హం. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు కనిపిస్తున్నాయి. పాట పాడు కానీ హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా పాడకూడదు.. ఇలా పాడటం హిందువులను కించపరిచారంటూ నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి అభిప్రాయాలను వెల్లడిస్తూ హెచ్చరికలు చేస్తున్నారు.

Rajasingh issued a warning to music director Devi sri Prasad

సమంత సారీ చెప్పాలని డిమాండ్ చేస్తూ పోస్టింగ్ లు పెడుతున్నారు. ఇక, దీని పైన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రియాక్ట అయ్యారు. సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ కు వార్నింగ్ ఇచ్చారు. హిందూ సమాజం ఇచ్చే గౌరవాన్ని స్వీకరించటానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. 'పుష్ప' సినిమా ఐటమ్ సాంగ్‌లో పదాలను.. దేవుడి శ్లోకాలతో పోల్చటాన్ని ఖండిస్తున్నామని అన్నారు.

Recommended Video

Bigg Boss Telugu 5 : VJ Sunny కిర్రాక్, Winner మావా... Shanmukh - Siri || Oneindia Telugu

దేవీశ్రీ ప్రసాద్ హిందువుల మనోభావాలను కించపరిచారన్నారు. దేవీశ్రీ హిందువులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఇప్పుడు వివాదంగా మారుతున్న ఈ వ్యవహారం పైన దేశీశ్రీ ప్రసాద్..మూవీ మేకర్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
BJP MLA Rajasingh issued a warning to music director Devisri Prasad and demanded an apology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X