అమెరికాలో తెలుగు టెక్కీ హత్యపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ స్పందన
అమెరికాలోని కాన్సాస్‌లో తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య పైన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం నాడు స్పందించారు.
న్యూఢిల్లీ: అమెరికాలోని కాన్సాస్‌లో తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య పైన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం నాడు స్పందించారు. అమెరికా ప్రభుత్వం అక్కడి మైనార్టీలలో ఆ దేశం పట్ల నమ్మకాన్ని తిరిగి సాధించడానికి ప్రయత్నిస్తుందని ఆశిస్తున్నామన్నారు.
ఇటీవల ఓ బార్‌లో శ్వేతజాతీయుడు అరుస్తూ వచ్చి కాల్పులు జరిపగా... ఈ ఘటనలో శ్రీనివాస్ మృతి చెందాడు. అలోక్ రెడ్డికి గాయపడ్డాడు. మా దేశం నుంచి వెళ్లిపోండి అని అరుస్తూ అతను కాల్పులు జరిపాడు.

ఈ ఘటనపై రాజ్‌నాథ్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో స్పందించారు. అమెరికా ప్రభుత్వం ఈ ఘటన పట్ల తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, శ్రీనివాస్, అలోక్ ఇద్దరూ హెచ్-1బీ వీసాలపై అమెరికాలో పని చేస్తున్నారు. శ్రీనివాస్ హత్యతో అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
More From
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications