చిరంజీవితో సంబంధం లేదన్న కాసేపటికే.. పవన్ కళ్యాణ్‌పై రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇలా!
Recommended Video

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు నటుడు రామ్ చరణ్ తేజ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పవన్ సోమవారం తెలంగాణలో తన పర్యటన ప్రారంభించిన విషయం తెలిసిందే. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజన్న గుడి నుంచి పవన్ తన పర్యటన ప్రారంభించారు.
చదవండి: నన్ను చల్లగా చూడు: కొండగట్టుకు పవన్ 11 లక్షల విరాళం, కారెక్కిన ఫ్యాన్స్, భార్య పనికి నవ్వుకున్నాడు
కార్యకర్తలు, నేతలు అభిమానులతో భేటీ అవుతున్నారు. మూడు రోజుల పాటు అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో భేటీ సమస్యలపై చర్చించనున్నారు. ఇదిలా ఉండగా, పవన్ సోమవారం మాట్లాడుతూ.. తన రాజకీయాలకు చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
చదవండి: తెలంగాణ పర్యటన వెనుక కొత్త వాదన, వెనుక కేసీఆర్!: కొండగట్టుకు విరాళం

పవన్ అలా చెప్పిన కాసేపటికే
తన రాజకీయ జీవితానికి కుటుంబ సభ్యుల మద్దతు లేదని కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు. పవన్ ప్రకటించిన కాసేపటికే బాబాయికి చెర్రీ శుభాకాంక్షలు తెలిపారు. ఫేస్‌బుక్ వేదికగా చెర్రీ మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

రామ్ చరణ్ పెట్టిన పోస్ట్
'నేను ఓ భారతీయుడిని, నా జన్మభూమిని రక్షించుకొనే బాధ్యత నాపై ఉంది.' అని కామెంట్ పెట్టి, తన బాబాయి పవన్ చేపట్టిన ఈ యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నానని చెర్రీ పేర్కొన్నారు. 'బాబాయ్ మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నా. జై జనసేన' అని పవన్ ఫోటో పెట్టి పోస్ట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మెగా ఆనందం
రామ్ చరణ్ తేజ ఈ పోస్ట్ పెట్టడంతో మెగా అభిమానులు ఆనందం, హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ను, చిరును, చెర్రీని ప్రశంసిస్తూ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. చెర్రీ పెట్టిన ఈ పోస్టును అభిమానులు బాగా షేర్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున లైక్స్ కొడుతున్నారు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు. మీ వెంటే మేము.. జై జనసేన అంటూ సాయి ధరమ్ తేజ ట్వీట్ చేశారు.

రామ్ చరణ్ తేజకు సూచన
అదే సమయంలో మెగా అభిమాన నెటిజన్లు చెర్రీకి ఓ సూచన కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ గ్రేట్ లీడర్ అని, ఆయన సినిమాల నుంచి వెళ్లిపోవడం బాధాకరమే అయినా ప్రజల కోసం తప్పదని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా చెర్రీని ఉద్దేశించి.. పవన్ సినిమాలు వదిలేసినందున మెగా ఫ్యామిలీ బాధ్యత నీదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

తెలంగాణలో పవన్
కాగా, సోమవారం కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ సవాళ్ల మధ్య రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తు్ననారని, తెలంగాణ తెచ్చారనే ఆయనకు ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. రెండు రాష్ట్రాల్లోను జనసేన పోటీ చేస్తుందని, బలం ఉన్న ప్రాంతాల్లో పోటీ చేస్తుందన్నారు. ఎన్ని సీట్లో వచ్చే ఎన్నికల ముందు చెబుతానని తెలిపారు. ఏ పార్టీ తనను వాడుకోవడం లేదని చెప్పారు. సినిమాల్లో తాను నటించనని చెప్పారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications