నయీంపై సినిమా తీస్తున్నా, ఒకటి సరిపోదు 3 పార్ట్‌లు: వర్మ

హైదరాబాద్: దివంగత టిడిపి నేత పరిటాల రవీంద్ర హత్య జీవితం ఆధారంగా రక్త చరిత్ర సినిమా తీసిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ... గ్యాంగ్ స్టర్ నయీం జీవితం ఆధారంగా సినిమా తీస్తానని ప్రకటించారు. ఆయన ఈ మేరకు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో స్పందించారు.

నయీం పైన తాను మూడు పార్టుల సినిమా తీస్తానని, రక్త చరిత్ర కేవలం రెండు పార్టులే ఉందని, నయీం చరిత్ర మాత్రం మూడు పార్టులుగా తీస్తానని ఆయన ట్వీట్ చేశారు.

నయీం అరాచకం: బయటపడ్డ అమ్మాయి అస్తిపంజరం, మాట విన్లేదని..

నయీ చరిత్ర చాలా క్లిష్టమైనదని, అంతేకాకుండా చాలా విషయాలు ఉన్నాయని, కాబట్టి ఆయన జీవిత చరిత్రను కేవలం ఒకే సినిమాగా చెప్పడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

Ram Gopal Varma to make a 3 part film on Nayeem

నయీం నక్సలైట్ జీవితం నుంచి పోలీస్ ఇన్‌పార్మర్‌గా అక్కడి నుంచి అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్‌గా ఎదిగాడని, ఇతను ఆల్ టైం క్రిమినల్ నెంబర్ వన్ అని పేర్కొన్నారు.

నయీం గురించిన సినిమా తీసేందుకు పూర్తి వివరాలు సేకరిస్తున్నానని చెప్పారు. వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరిస్తున్నానని చెప్పారు. అతని నేర చరిత్ర ఏళ్ల కొలది సాగిందని రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+