కేజ్రీవాల్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేయాలి: రాంగోపాల్ వర్మ సంచలనం
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు, సోషల్ మీడియా కామెంట్లతో వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ఈసారి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
భారత బలగాలు పాక్‌లో సర్జికల్ దాడులు జరిపిన ఘటనపై ఆధారాలు చూపాలని ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే పలువురు ప్రముఖులు, నెటిజన్లు కేజ్రీవాల్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. చేస్తున్నారు.

తాజాగా రాంగోపాల్ వర్మ కూడా కేజ్రీవాల్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. 'జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్‌పై సర్జికల్ దాడులు చేయాలి. కేజ్రీవాల్ వేసుకునే మఫ్లర్ చూసి కోతిలా ఉన్నాడనుకునే వాడ్ని. ఇప్పుడు భారత సైన్యంపై కామెంట్లు చేస్తూ నిజంగానే కోతి అని నిరూపించుకున్నాడు. ఆప్ పార్టీని 'పాప్'(పాప్ అంటే పాపము) పార్టీగా మార్చాలి. జై అల్లా కేజ్రీవాల్' అని ట్వీట్ చేశారు వర్మ.
అంతేగాక, మరో తీవ్ర వ్యాఖ్య కూడా తన ట్విట్టర్ చేశాడు. అయితే, ఇప్పటి వరకు రాంగోపాల్ వర్మ ట్వీట్లపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు గానీ, కేజ్రీవాల్ గానీ స్పందించలేదు. కాగా, కొందరు నెటిజన్లు మాత్రం రాంగోపాల్ వర్మ ట్వీట్లకు మద్దతు పలుకుతూ రీట్వీట్లు చేస్తున్నారు.
Kejriwal questioning integrity of armed forces proves he's cross breed between Hanuman's Sugreeva and Musharaf's Shareef #JaiAllahKejrewal
— Ram Gopal Varma (@RGVzoomin) 5 October 2016
Armed forces apart from external surgical strikes should do internal surgical strike on anti nationalist Kejriwal #JaiAllahKejrewal
— Ram Gopal Varma (@RGVzoomin) 5 October 2016
With his muffler cap I always thought he looked like monkey but now after his comments on armed forces I realised that he's truly a monkey
— Ram Gopal Varma (@RGVzoomin) 5 October 2016
ఇది ఇలా ఉండగా, నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం చేపట్టిన మెరుపుదాడుల విషయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సాక్ష్యాలు అడిగారని బిజెపి, మీడియాలు వాదిస్తున్నాయి.. కానీ వాటిల్లో నిజం లేదని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. బుధవారం గోవాలో మీడియా సమావేశంలో సిసోడియా ఎల్‌వోసీ దాడులపై స్పందించారు.
సబూత్(ఆధారాలు) అన్న పదమే ఉపయోగించలేదని, కేవలం పాకిస్థాన్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలకు దీటుగా స్పందించాలని మాత్రమే ఆయన ప్రధానిని అడిగినట్లు సిసోడియా తెలిపారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications