• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వర్మ ‘జీఎస్టీ’: ఊహించని ట్రాఫిక్.. వెబ్‌సైట్ క్రాష్! మళ్లీ రిలీజ్ ఎప్పుడంటే...

By Ramesh Babu
|

హైదరాబాద్: వివాదాలకు కేరాఫ్ అడ్రెస్.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. పోర్న్‌స్టార్ మియా మాల్కోవాతో ఆయన తెరకెక్కించిన 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్'(జీఎస్టీ) లఘు చిత్రం కోసం ఆయన అభిమానులు, ఔత్సాహికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ముందుగా ప్రకటించిన ప్రకారం రిపబ్లిక్ డే రోజైన శుక్రవారం ఉదయం ఆన్‌లైన్‌లో ఈ లఘుచిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ విడుదల చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో ఓపెన్ కాలేదు. దీంతో నెటిజన్లకు చివరికి నిరాశే మిగిలింది.

ఆలస్యమైనందుకు క్షమాపణ కోరిన వర్మ...

ఆలస్యమైనందుకు క్షమాపణ కోరిన వర్మ...

జీవితంలో ఇంత వరకూ ఎన్నడూ ఎవరికీ ‘సారీ' చెప్పని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ... తొలిసారిగా తన లఘుచిత్రం ‘జీఎస్టీ' విడుదల విషయంలో సారీ చెప్పాడు. ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' వీడియోను ఆన్‌లైన్‌లో ఒకేసారి లక్షలాది మంది ఓపెన్ చేయడం వల్ల వెబ్‌సైట్ క్రాష్ అయి ఓపెన్ కాలేదని, వీలైనంత త్వరలో మళ్లీ ఈ వీడియోను విడుదల చేస్తామని రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. తన వీడియోపై ఫేస్‌బుక్ ద్వారా స్పందించిన ఆయన యూఎస్ ప్రొడ్యూసర్స్ లోపాన్ని సవరించే పనిమీద ఉన్నారనీ.. వీలైనంత త్వరలో ఈ లఘు చిత్రాన్ని నెట్టింట్లో ఉంచుతామని చెప్పుకొచ్చాడు. ‘ఆలస్యమైనందుకు క్షమించగలరు' అని వర్మ ఫేస్‌‌బుక్‌‌లో పోస్ట్ పెట్టాడు.

వర్మ పోస్ట్‌పై నెటిజన్ల కామెంట్స్...

వర్మ పోస్ట్‌పై నెటిజన్ల కామెంట్స్...

జీఎస్టీ విడుదలపై వర్మ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌పై నెటిజన్లు ఓ రేంజ్‌‌లో విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘వర్మ గారూ నీలాంటి మార్కెట్ మైండ్ మరొకరు ఉండరయ్యా! జీవితంలో ఫస్ట్ టైం రాంగోపాల్ వర్మ నోటి నుంచి సారీ అనే పదం వచ్చింది. అసలు మీరు సినిమా తీశారా.. లేదా? ఎందుకో నాకయితే డౌట్ కొడుతోంది. సారూ మా మొహంపై ఓ ఫ్రీ లింక్ పడేయండి మేమూ చూసి తరిస్తాం. మీ వీడియో కోసం మొబైల్స్ ఎత్తి పట్టుకుని ఉన్నాం.. ఇంకా ఎంతసేపు త్వరగా అదేదో కానిచ్చేయండి..'' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గూగుల్ ట్రెండ్స్ బయటపెట్టిన వర్మ...

గూగుల్ ట్రెండ్స్ బయటపెట్టిన వర్మ...

పోర్న్ మూవీ అంటూ విమర్శలు వచ్చినా.. మహిళా సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేసినా.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను చేయాలనుకున్నది చేసేశాడు. ఆయన తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్'మూవీ మొత్తంమీద ఆన్‌లైన్‌లో కనిపించినట్లే కనిపించి మాయమైంది. మియా మాల్కోవా అందాలను వీక్షించేందుకు నెటిజన్లు ఎగబడటంతో వెబ్‌సైట్‌కు ఊహించని మొత్తంలో ట్రాఫిక్ వచ్చింది. దీంతో వెబ్‌సైట్ స్తంభించింది. అంతకు ముందు జీఎస్‌టీని ఉద్దేశించి ట్వీట్ చేసిన వర్మ.. దీపికా పదుకొనే కంటే ఎక్కువ మంది మియా మాల్కోవానే చూసేందుకు ఎగబడుతున్నారంటూ ‘గూగుల్ ట్రెండ్స్‌'ను కూడా బయటపెట్టాడు.

27న ఉదయం 9 గంటలకు విడుదల...

27న ఉదయం 9 గంటలకు విడుదల...

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' మూవీకి నెటిజన్ల నుంచి వచ్చిన ఆదరణ చూసి ఆ సినిమా నిర్మాతలు అవాక్కయ్యారు. వెంటనే తమ వెబ్‌సైట్‌ను అప్‌గ్రేడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. రామ్ గోపాల్ వర్మ కూడా ఫేస్‌బుక్ ద్వారా నిరాశపడకండంటూ నెటిజన్లకు సూచించాడు. అంతేకాదు, మరికొద్ది గంటల్లో జీఎస్టీ వీడియో అందుబాటులోకి వస్తుందని తెలియజేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్న జీఎస్టీ మూవీని తిరిగి జనవరి 27న ఉదయం 9 గంటలకు రీ రిలీజ్ చేయబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

English summary
Watch God, Sex and Truth Full Video In HD: God, Sex and Truth is slated for release on January 27th at 9 am on godsextruth.online, the same date Sanjay Leela Bhansali’s Padmaavat is set to release, after almost a year of protests. Following this announcement, RGV put out a tweet on his official Twitter and Facebook pages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X